పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/360

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. అంత గభస్తిమంతుఁ డపరాంబుధి నీరములోనఁ గ్రుంకి దై
త్యాంత[కు మేన నయ్యెడ][1] మహాగరిమం గయికొన్న[2] తాప మం
తంత కసహ్యమై నిగుడ నంబరవీథుల నిల్వనోడి తా
పాంతకృదాప్లవార్థము రయంబున నీరము చొచ్చు కైవడిన్. 31

తే. మోహసందీపనార్థమై మురవిరోధి
యెడమఁ గుడియును నందంద యేసి యలఁత
నొంది యెడలించు మరుని నిట్టూర్పు లొక్కొ
యనఁగ నల్లన వీచె మందానిలములు. 38

తే. [సరిద][3]ధిప[4]దత్తమౌక్తికాంజలి కరణము
లోలిఁ జేయించె యదుభర్త కుబుసుపోక
అబ్ధివీచి నటీకోటి యాటచూపు
నటు వలునాఁగ విధుకిరణములు వొలిచె. 39

మ. కలకంఠీకలకంఠముల్ కలకుహూకారధ్వనుల్ నీనులం
బలుమాఱుం జిలికింపఁగా వనలతాప్రాంతంబులం డాయుచున్
లలి మాకంద[మృణాల][5]నాళములు కేలంబట్టుచు న్వచ్చి తొం
గలి పూమైమరు వూడ్చి చొచ్చె హరి రాకాకౌముదవహ్నులన్. 47

ఉ. ఆతఱి మింటనుండి డిగి యంబురుహాసనసూతి నారదుం
డాతతపాండురాంగరుచి(రాంశుసు)[6]ధారసధార దేవకీ
జాత తనూమనోభవకృశానువు నార్పఁగ వచ్చె ఖేచర
వ్రాతము మోడ్పుఁజేతులు శిరంబులఁజేర్చుచుఁ ద్రోవ యీయగన్.

శా. రామారామవసంతసంతత[యశోరా[7]]జద్దిశాభోగ[8]భో
గామర్త్యవ్రజరాజరాజధరరక్షాధారధారాపురీ
స్వామి స్వర్తృశమాన మానవసమాజస్వీక్రియాదక్ష! ద

క్షామిత్రస్మృతిలోల! (లోలన)[9]యనాత్మాంభోజపుష్పంధయా! 49

  1. ప్రా.పూర
  2. మహాగరిమగైకొన్న—సా.ప.
  3. ప్రా.పూర
  4. (ధత)—సా.ప.
  5. ప్రా.పూర
  6. ప్రా.పూర
  7. ప్రా.పూర
  8. బుద్ధిశాభోగ—సా.ప.
  9. ప్రా.పూర