పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/184

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. పూసిన పుష్పపాంసు ననభూతి విలేపములో సురఃస్థలో
    ద్భాసి బిసోరగారరణ పంక్తులలో జడగొన్నవేణితి
    నాసరసీరుహాక్షి వసుధాధిప యెంతయి నొప్పెఁ బుష్పబా
    ణాసనుమీఁది .....యన మహానటమూర్తి వహించెనో యనన్. 99

ఉ. ఇంకెడి పంకమధ్యమున నెండఁ దలంకెడు మీనువోలె నే
    ణాంకనిబాస్య యుండెఁ దలిరాకులఁ జేసిన పాన్పుపై సఖుల్
    శంకిల కప్పటప్పటి కలందిన చందనకర్దమంబులోఁ
    గ్రుంకి మనోజతాపమునఁ గుందుచు నుల్లము తల్లడిల్లగన్. 100

వ. అప్పుడు సఖీజనంబులు తమ సేయు హిమోపచారంబు లనలంబునం బోసిన యాజ్యాబిధారలుంబోలె నై యగ్గజగామిని మేని యగ్గి యగ్గలం బగుటకు బెగ్గిలి కళవళుం సమయంబున నొక బోటికత్తియ యక్కిసలయానన మేని యవస్థాంతరం బుపలక్షించి వారితో నిట్లనియె. 101

ఉ. చందన గంధసార ఘనసారములన్న భయంబు నొందెడిం
    గుందెడు పువ్వులన్న మదిఁ గొంకెడిఁ బుప్పొడియన్న లోఁగెడిం
    గెందలిరాకులన్న సరసీరుహలోచన నేఁటి చందముల్
    కుందసుగంధులార! కనుగొంటిరె యేటికి శైత్యకృత్యముల్. 102

ఉ. కంజదలాక్షి నిన్నఁ గరకంజమునం జిగురూఁది వేడ్కఁ జూ
    డ్కిం జనుదోయిమీఁదఁ దులకించిన భావము నిట్లకాదె యీ
    కుంజరరాజయాన కుచకుంభములం జిగురాకు తూలికన్
    మంజువిలాసవిభ్రమసమంచితునిన్ మరు వ్రాసెఁ జూడరే. 103

ఉ. పోయెద నంచు లేచి తలపోసి మదిం దుదిలేను నెవ్వగం
    దోయలి గప్పెఁ గన్నుఁగవ తొంగలిఱెప్పల వేఁడియూర్పుతో
    నీయలివేణి రూపయుతునెవ్వనినో కలఁగాంచి వానికై
    కాయజవేదనం బడెడుఁ గావలయుం బరికించి చూడఁగన్. 104