పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/182

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తలిరుఁగైదువుజోదుఁ దలఁచి పుప్పొడి పూవుఁ
బోఁడినెన్నుదుటిపై బొట్టువెట్టి
కొదమతుమ్మెదఁ బేరు గ్రుచ్చి క్రొవ్విరి బాల
కబరికాభరముపైఁ గదియఁజేర్చి
ప్రోడకోయిలలఁ దూపొడిచి లేఁజిగురాకు
లీలావతికి సురాలించి వైచి
యుదుటి కీరములపే రుగ్గళించి యనంట్ల
మేలి తీయనిపండ్లు మీఁదులెత్తి
తే. యించునెలదమ్మితూండ్లు రాయంచలకును
బక్ష్మలాక్షికిఁ జుట్టిరా బడిసి వైచి
యామినీభర్తకును జూపి హల్లకంపు
టలఁతి పూదండ పూఁబోఁడి యఱుతఁగట్టె. 92

సీ. మేన నంతట నొక్కమృగలోచన యలందె
కమనీయచందనకర్దమంబు
పడఁతి యొక్కతె సారె పన్నీరు చిలుకుచు
విసరెఁ బల్లవతాళవృంతములను
వేనలిజడయంటు విచ్చి పాపటమీఁదఁ
బూఁబోఁడి యోర్తు కప్పురముఁ జల్లె
విరితేనెఁ దడిపి క్రొవ్విరుల పరాగంబు
సకియోర్తు హత్తించెఁ జరణములను
తే. జెలువయొక్కర్తు తడిపె ముంజేతఁ గ్రొత్త
కమ్మనెత్తావి గొజ్జంగి కంకణంబు
తమ్మిలేఁదూండ్ల పుంజాలదండ యఱుతఁ
బెట్టె నొక లేమ యా చంద్రబింబముఖికి. 93

సీ. చేరుచోఁ దనువల్లి సెగలకు భయపడి
చిగురాకు లెడమాటు చేసికొనుచు
మేనంటుచో వేఁడిమికిఁ గాఁక సారెకు
మునివ్రేళ్ళు పన్నీట మోపికొనుచుఁ