పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. అని బిట్టూర్పుచుఁ[1] బోటికత్తియలతో నామాట జెప్పంగ సి
గ్గున వంచించుచు నన్వహంబు మదిఁ గొర్కు ల్మూరిఁబోవంగ ని
ల్చినచో నిల్వఁగరాన వేదనలచేఁ జీకాకునం బొందుచున్
వనజాతాయతనేత్ర యుండె మదనోన్మాదంబు రెట్టింపఁగన్. 24
 
వ. ఆ సమయంబున— 25

వసంతర్తువర్ణనము


మ. విరహగ్లానికరంబు భూజనసుఖావేశంబు నానావనీ
తరువల్లీతనుసిద్ధి షట్పదసముత్సాహంబు నిర్జీవిత
స్మరసంజీవనసిద్ధవిద్య పికవాఙ్మానవ్రతోద్యాపనం
బరుదెంచె న్మధుమాస మంచితలతాంతామోదితాశాంతమై. 26

సీ. కోకిలకాకలీకోలాహలంబుతోఁ
బొలుపొందె మాకందభూరుహములు
మధుమత్తరోలంబమధురస్వనంబుతో
భాసిల్లె పున్నాగపాదపములు
కుసుమసౌరభభరాలససమీరములతోఁ
గనుపట్టె వాసంతికాగృహములు
వాచాలమదకీరవాచారవంబుతో
దీపించె బరువులై తియ్యమావు
గీ. లలరుఁ దేనియజ ల్లేరులై గమించె
రాలి పుప్పొడి సైకతరాసు లయ్యె
నిఖిలవనికాభినవరామణీయ మగుచు
వసుధఁ జెన్నొందు మధుమాసవైభవమ్ము[2]. 27
 
మ. పునరుజ్జీవనమంత్రముల్ మృతమనోభూభూమిభృన్మౌళికిన్[3]
స్తనితంబుల్ మధుదుర్దినంబులకు భాస్వత్సామిధేనుల్ వియో
గినికాయస్మరవహ్నికిన్ మధమహీక్షిత్సేనకుం గాహళుల్
వినవచ్చెం గలకంఠకూజితము లుద్వేలంబులై తోఁటలన్. 28



  1. బిట్టూర్పుచు
  2. వైభవముల
  3. భృన్మేళికల్