పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. సింహాసనమునకుఁ జెంతల నిరుగడ
బిసలతాకరలు సీవిరులు వీవఁ[1]
గొలువనేతెంచురాజులఁ బేరుపేరున[2]
వేత్రహస్తులు విన్నవించి పలుకఁ
దమమీఁద నలవోక తలకొను[3] చూడ్కికి
జనపతుల్ మౌళి నంజలులు సేర్ప
దిగ్దేశపతులు పుత్తెంచిన కానుక
లానతిఁ బనివార లందుకొనఁగఁ
తే. జేరి సేవించు మూర్ధాభిషిక్తవితతి
నడుమఁ గులపర్వతంబుల నడుమఁ దనరు
మేరుగిరివోలెఁ గొలువిచ్చి మెఱసియున్న
ధారుణీవల్లభునిఁ గాంచి చేరఁబోయి. 117
 
వ. వినయోత్థానపూర్వకంబుగా విభుం డాచరించునాతిథేయసపర్యల నాదరించు యుండునంత నమ్మహీకాంతుండు మాతలి నవలోకించి. 118

క. అనఘాత్మ నీవు వచ్చిన
పనిఁ దెలియఁగఁ బలుకు దేవపతికిన్ సుఖమే
దనుజావళి క్రొంగోల్తల[4]
పని గలిగెనొ మమ్ముఁ బంచి పనిగొనుటలకున్. 119
 
క. అనవుడు మాతలి వినయం
బున జననాథా సుఖంబ పురుహూతునకుం
బని యొండు లేదు నందన
వనలీలాసక్తుఁ డగుచు వాసవుఁ డొప్పెన్[5]. 120



  1. కిసలయాధరలు సీవిరులు వీవ
  2. కొలువ నేతెంచురాజులు వేరవేరన
  3. కలకూన
  4. కొంగోలల
  5. డట్లెన్; డప్పెన్