పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతలి యాగమనము


ఉ. దివ్యవిమానదీప్తి నలుదిక్కుల దీఁటుకొనంగఁ గింకిణుల్
శ్రావ్యములై చెలంగఁ బృధులధ్వజలాంఛన మొప్ప శక్ర సం
భావ్యగుణుండు మాతలి నభంబున వెల్వడి సాద్భుతేక్షణా
భివ్యసనంబునం దవిలి పెల్లుగఁ[1] బౌరులు దన్నుఁ జూడఁగన్. 113

వ. వచ్చి మొగసాల ముందటిచాయ వినువీధి విమానంబు నిలిపి యవనీతలంబున కవతరించి. 114

సీ. అమితప్రవాహంబులై యామ[2]వేదండ
దానధారాంబువుల్ తళ్కు[3](లొలయఁ)[4]
దఱచైన పల్లకి దండెల యెడ మాటు
మానికంబులు[5] కాంతు లీనుకొనఁగఁ
గడచూరు ముత్యాలగొడుగులపైఁ బైడి
కుండలదీప్తులు గొండ్లియాడ
మురువైన తేజీల ముఖపేనఖండముల్
క్రొత్తముత్తెపుమ్రుగ్గు కొమరు నీన
తే. మూఁపుమూఁపున రాయంగ మూఁగి నిలిచి
యవసరము గోరు వివిధదేశావనీశ
సంఘముల సందడులతోడ జానుమిగులు
ననుఁగుమొగసాలకడ డాసియుండఁ గడచి. 115
 
వ. ప్రతీహారోపదిష్టమార్గంబున నడచి కక్ష్యాంతరంబులు గడచి ముందట. 116



  1. భౌవ్యనినంబునం దనిరి పెల్ముగ
  2. అయితప్రవాహంబు ద్వయామ; అసితప్రవాహంబులౌ
  3. తళు తూళట్మ
  4. తళ్కులొత్త
  5. మానికంబుల