పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. వీనులనించి వాద[1] మొదవింతురు భేదము సేయలేమినో
యానగరంబులోని మణిహర్మ్యతలంబున నాడుచేడియల్
మానితనందనోపవనమద్యచరన్మరుదంబుజాననా
గానవిశేషఘోషకలకంఠవధూకులకంఠనాదముల్. 80
 
ఉ. ఉన్నతసౌధశృంగములనుండి చెరంగులు మెట్టి వంగి యా
సన్నవియన్నదీసలిలసంహతి నీడలు చూచి చేడియల్
చన్నులు జక్కవల్ కురులు షట్పదముల్ వదనంబు లబ్జముల్
కన్నులు గండుమీ లని తలంతురు మాటికి మానసంబులన్. 81

ఉ. వంచన మస్తరించుఁ బ్రతివారము బాహ్యవిహారకేళి కుం
కించన వేళ నాకపతి గేరుకొనంగఁ[2] బురంబుమేడలం
దంచుల గండరించినయుదగ్రకరిద్విషదాననంబులం[3]
గాంచి భయంబునం బరచు గంధకరిన్ శిర మప్పళించుచున్. 82
 
ఉ. అన్నగరోపకంఠముల నారఁగఁ బండిన రాజనంబు కా
పున్న జఘన్నరాజముఖు లుబ్బున చన్నులయున్నతిం గరం
బన్నువకౌనుఁ దీఁగె లసియాడ శుకంబులఁ దోలు లీల లా
సన్నమహీచరత్పథికసంతతి కాత్మల నింపు[4] నింపులన్. 83
 
చ. చఱపఁగరాదు చప్పటలు చన్నుల యున్నతి నూని వేగమై[5]
పఱవఁగరాదు వింతకటిభారము పెంపున మోవి విచ్చి తాఁ
జఱవఁగరాదు కీరముల సంతతి నిచ్చట నేల యంచుఁ గ్ర
మ్మఱుదురు చేలకావలులు మాని జఘన్యజభామ లిండ్లకున్. 84
 
చ. వెడలురసంబుతోఁ దొడిమ[6] వీడి రసాలఫలోత్కరంబుపైఁ
బడినఁ దునుంగునిక్షువులఁ బాయక క్రమ్మురసంబు వాగులై
బడి బడిఁ[7] బాఱఁగాఁ బెరుఁగు ప్రాసఁగు[8]చేలకు సారెసారెఁ గ
ప్పిడుదురు పౌరపామరమృగేక్షణ లంబురుహోత్పలంబులన్. 85



  1. మోద
  2. నొక్కసతి శేరగొనంగ
  3. కరిఁటిషదాననంబులన్
  4. బెంపు
  5. (సానిరేగమై)
  6. మొడమ
  7. బడి(పరి) పారఁగా
  8. ప్రాసుగు