పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఏవంవిధకోనాంబా
సేవాపరితుష్టశుద్ధచిత్తాంబుజుఁడై
కోవిదవినుతోభయకుల
పావనుఁడై లోకమంత్రిభాస్కరుఁ డలరెన్. 65

క. ఏవంవిధగుణసుభగం
భావునకును నిత్యకలితభావునకుం జే
తోవనరుహలక్ష్మీసం
భావితరామునకు బాహుబలభీమునకున్. 66

క. కసువాంబావరపుత్త్రున
కసిధారాదళితమదవదరిగోత్రునకున్
బిసరుహదళనేత్రునకును
రసికకవిస్తుతవికస్వరచరిత్రునకున్. 67

క. నాకాధిపగజరాజని
శాకరకోటీరనిభయశస్సాంద్రునకున్
లోకామాత్యాన్వయ ర
త్నాకరచంద్రునకు మతిజితాహీంద్రునకున్. 68

క. కుటిలాలకాళినూత్న
స్ఫుటకటకఝణన్నినాదశోభితకరసం
పుటతాళవృంతజ[1]మరు
న్నటదురుకుంతలున కధికనయవంతునకున్. 69
 
క. భీమభుజాసారునకున్
హేమాచలధీరునకును హృదయోద్దామ
ప్రేమవసంతోల్లాసిత
రామారామునకు శౌర్యరఘురామునకున్. 70



  1. మృదంగ