పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అం దగ్రజుండు. 41

సీ. తూలించె యీచకస్తోమదౌర్గత్యాంధ
కారంబు దానభాస్కర గభస్తిఁ
దేలించె మదవతీదృక్చకోరంబుల
సౌందర్యచంద్రికానిరసంబెఁ
బాలించె నాచక్రవాకసర్వంసహా
భరణంబునకు నిజబాహుశక్తి
వ్రాలించె దశదిశా ననజాకరంబుల
నిజకీర్తిహంసికానివహములను
తే. వేడ్క విరియించె శాత్రవోర్వీకళత్ర
పట్టణంబులఁ బటహోగ్ర1భాంకరణము
లనఁగ[1] వెలుఁగొందు దండనాథాత్మజుండు
లోకనుతదానజితసౌరి లోకశౌరి. 42
 
క. ఆ లోకదండనాథుఁడు
బాలేందుకళాధరుండు పార్వతిఁ బోలెన్
లీలం బరిణయమయ్యెను
బాలామణి కసువమాంబఁ పద్మదళాక్షిన్. 43

సీ. ఆత్మేశుఁ డొక్కచో నాగ్రహించినచోటఁ
గూర్మి యంతంత కెక్కుడుగ నడచుఁ
బని చెప్పునప్పుడు పతిమాట కడ్డంబు
కలలోన నైనను బలుక దింత
యలవోకకైనను నాడ దెన్నఁ డసత్య
భాషణంబుల నెంత పనికి నైన
నెమ్మితో భర్త మన్నించిన మదిలోన
గర్వింపనేరదు కడఁక మీఱి



  1. భాంకరముల ననగ