పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. అలమె దిక్చక్రవాళాచలప్రాచీన
మతులితగుణశాలితాప్తిచేత
విరియించె శాత్రవోర్వీనాథనీహార
ముగ్రాసి నవవసంతోదయమున
వాసించె బ్రహ్మాండభవనపేటికలను
సత్కీర్తికర్పూరనారమహిమ
నలరించె నాప్తమిత్రాననాంభోజముల్
ప్రచలితైశ్వర్య[1]ప్రభాతములను
తే. నతని వర్ణింపఁధగు మహోదాత్తపటహ[2]
భేరిభాంకారరవధావి తారినృపతి[3]
కామినీవేష్టితాహార్యగహ్వరుండు
ఘనుఁడు గోవిందమంత్రి నాగప్రభుండు. 39
 
సీ. ఆరసాతలగభీరాంబుపూరములుగాఁ[4]
గట్టించెఁ జెఱువు లుత్కంఠతోడ
నందనోద్యానకాననమున కెనగాఁగ
నొప్పుగా నిర్మించె నుపవనములు
గగనకూలంకషాకారశృంగములుగా
నిలిపించె దేవతానిలయసమితి
పక్వశాకాపూపపాయసాన్నంబులఁ
దనిపె ధాత్రీసురోత్తముల భుక్తి
తే. ననఁగఁ గొనియాడఁదగు సమస్తావనీశ
సభల సత్కీర్తి లక్ష్మీవిశాలుఁ డగుట
మహిమ గోవిందమంత్రి కుమారవరుఁడు
మారగుణహారి నారనామాత్యశౌరి. 40



  1. ప్రచాతతరైశ్వర్య
  2. మహోదారు
  3. ధావదరి నృపాల
  4. పూరములుగాఁగ