పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూతేశ్వరోదగ్రభూమీధరోత్తుంగ
శృంగాగ్రముల జిల్లజీర్కు లాడి[1]
శుభ్రశోభాదభ్రసురవాహినీలురో
ర్మికల మీఁదట జలక్రీడ సలిపి
తే. మెఱసి యేమంత్రికీర్తిభామిని చెలంగు
నట్టి మహనీయరూపమోహనవిలాస
భాసురశ్రీ పరాభూతపంచశరుఁడు
విభవవిజితబలారి గోవిందశౌరి. 34

క. కులిశాయుధగజ శంకర
కలశపయోనిధి సమాన ఘనకీర్తులచే[2]
విలసిల్లె నఖిలజగమున
సలలితబలశాలి యన్నసచివుఁడు మహిమన్. 35
 
క. ఖేచర తుహినమరీచి ద
ధీచిప్రతిమానదానధిక్కరుఁడై రా
కాచంద్రముఖీ సుమనా
రాచుఁడు బాచప్రధానరత్నము వెలసెన్. 36

క. అం దగ్రసంభువుఁడు గో
విందుఁడు బృందారకేంద్రవిభవాఢ్యుఁడు గో
విందుఁడు రమ నరియించిన[3]
యందమున వరించె గంగమాంబను వేడ్కన్. 37
 
గీ. అట్టి గంగాంబ నిత్యశీలావలంబ
లోకలోచనవిభుఁ డైన లోకవిభుని
నారదండాధినాథుని నాగవిభుని
ముగురుగొడుకులఁ గనియె సమ్మోదమునను. 38



  1. చిల్కజీర్కు లాడి
  2. కీర్తులచేతన్
  3. విందుఁడు డురరమ రచియించిన