పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతికర్తృ నాత్మప్రజ్ఞ


సీ. కౌండిన్యగోత్రవిఖ్యాతుండు సత్కవి
మాన్యుండు నారనమంత్రిమణికి
వనిత యక్కాంబకు వరతనూజుఁడఁ గిసా
నాఖ్యునకును గూననాహ్వయునకు
గారాపు సయిదోడ నారాయణపదార
వింద సంసేవనావిమలమతిని
గావ్యనిష్ణాతుఁడ గజరావు బిరుదాంకు
లగు[1] రాచవారికిఁ దగు హితుండ
తే. సృష్టి (వాచామగోచర స్నిగ్ధ) వర్త
నాభిరమ్యుండ[2] బంధులోకానుభావ్య
మానవిభవుండ నయకళామందిరుండ
సూరనాఖ్యుండ సత్యసంశోభితుండ. 15
 
కవి తన ఇంటిపేరు, ఊరిపేరు, కావ్యరచనాకాలం చెప్పుకోలేదు. కాని ఆశ్వాసాంతగద్యప్రకారం ఇంద్రేశ్వరాలయం కడపమండలంలో చింతలపాట్టూరనే గ్రామంలో ఉంది. ఈ కడప మండలంలోనే భాస్కరమంత్రి నివాసగ్రామం ముడియం అగ్రహారం ఉండడం వలన, గ్రామంపేరే ఇంటిపేరుగా స్థిరపడి ఉంటుంది. కవికూడ కడప మండల నివాసి అయి ఉండాలి.

ఉ. ఆధునికప్రబంధరసహావమనోహరభావరేఖ నీ
మాధురు లేమి తక్కువలె మాన్యచిరంతన కావ్యబంధనో
ద్బోధకహావభావరసపూర్తుల గ్రుచ్చి కలంచిచూడ ను
చ్ఛోధకు[3]లైన భూవిభులు చొప్పడకుండుటగాక యెయ్యెడన్. 16
 
వ. అని యీ ప్రకారంబును విద్యోతితాత్మప్రజ్ఞాధురంధరుండైన మాతండ్రి సూరన మంత్రి నిర్మించిన యుదయనోదయంబను మహాప్రబంధంబు తత్సూనుండగు నారనామాత్యవరుం డుపలక్షించి యేతత్కావ్యకన్యకకుం దగువరుం డెవ్వండు గలఁ డొకో యని తలంచు సమయంబున. 17



  1. బిరుదాంకుఁడగు
  2. వక్రనాభిరామ్యుండ
  3. కచ్చోధికు, కుచ్చోధకు