పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయనోదయము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతా ప్రార్థనము

ఉ. శ్రీసతి క్రొమ్మెఱుంగు మణి చిత్రిత శే[1]షభుజంగశయ్య యు
ద్భాసితశక్రచాపలత తాన సితాంబుద మంచు శంకఁ బ
ద్మాసనముఖ్యు లెవ్వని సుధాబ్ధిఁ దలంపుదు రట్టిదేవతా
గ్రేసరుఁ డిచ్చుఁగాత జయకీర్తులు లోకయబాచ శౌరికిన్. 1

శా. శ్రీలక్ష్మీపతి భక్తమౌనిజనసంసేవ్యుండు వేదాంత వి
ద్యాలంకారుఁడు పంకజాక్షుఁడు[2] ప్రసాదాయత్తచిత్తంబుతోఁ
బాలించున్ స్థిరకీర్తి చంద్రకిరణప్రాగ్భారసంఛన్న లో
కాలోకాచలు లోకమంత్రిమణి బాచామాత్యచూడామణిన్. 2

చ. పరినటనావధి న్నిటలభాగము చెమ్మట యొత్తి శర్వరీ
కరుఁ దిలకించి చారుసితకంజదళంబని మౌళిఁ గ్రమ్మఱం
జెరివి (గళస్థలి న్నెగ[3])డు చిహ్నము తేంట్లని[4] చేమరల్చు[5]
గ్గిరిజ నగన్[6] శివుం డొసఁగుఁ గీర్తులు లోకయబాచమంత్రికిన్. 3

ఉ. పొక్కిటి కమ్మితేఁటి బలెఁ బొందిన బిడ్డఁడు భారతీసతిం
బుక్కిటఁ గాపురంబిడిన ప్రోడఁడు వెన్నెల వన్నెతేజి వీఁ
పెక్కిన మేటిరౌతు జగమెల్ల సృజింపఁగఁ జాలు వేల్పురా
జెక్కుడు లగ్గ లోకసచివేంద్రుని బాచనిఁ బ్రోచుఁ గావుతన్. 4



  1. చిత్రితశే తా.ప్ర.లో లేదు. వ్రా.ప్ర.లోని పాఠము
  2. వినాయకుండు-తా.వ్రా.ప్ర.
  3. ప్రా.పూర.-జెరివి వినీలకాంతు లి-సా.ప.పూర
  4. ప్రా.సవ. చిన్నము తంటని-తా.వ్రా.ప్ర., చిన్నముతేఁటని-సా.ప.
  5. వ్రా.ప్ర.-చెమరల్చు-తా.వ్రా.ప్ర.
  6. సా.ప.-నగున్-తా.ప్ర.