పుట:ఉత్తరహరివంశము.pdf/236

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

181


దనఁ గనుఁగొని కుంభాండుని
తనూజ యగుచిత్రరేఖ తా ని ట్లనియెన్.

94


చ.

ఎఱిఁగితి నీతెఱంగు విను మిందుముఖీ యొకనాఁడు ముగ్ధ
దఱమును గూడియాడఁగ సుధాకరశేఖరుకాంత నీమదిన్
నెఱసినకోర్కి దీర్ప నొకనేర్పరి నీ కల వచ్చు నంటకం
దఱి యిదివో దినంబును సుధాభవనంబునుఁ బ్రొద్దుఁ జూడఁగన్.

95


క.

మఱచితిగాక లతాంగీ
కఱకంఠునితోడ నాఁడు కాత్యాయని నీ
[1]నెఱ నెఱిఁగి నాఁడు సెప్పిన
తెఱఁ గిది సమకూడె నింక దిగు లేమిటికిన్.

96


వ.

అనుటయు నబ్బోటి చిత్తంబున వాటం బయిన పరిభవాభిమానంబు విరిసిన
గన్నీరు దుడిచికొని కొనలుసాగుకోర్కులు గులుకుతలంపులఁ దమకంపు మొల
కలు వొడమం గడమ వడినలజ్జ కడకన్నులం బెరయ నుండెనప్పుడు.

97


మ.

పరపయ్యెం బరిభోగవాంఛ దడవం బా లయ్యె నిద్రారతుల్
పొరపయ్యెం బలుదాల్మి వింతవగపుం బ్రోవయ్యె నాలాపముల్
నెరపయ్యె న్మదనానలంబు వరుస న్నీరయ్యె నాలేపముల్
[2]సొరపయ్యె న్దనువల్లి బాణుసుతకున్ సోలింతలం దూలుచున్.

98


క.

లోఁగిటికి రాని రూపముఁ
గౌఁగిటికిన్ రానిపొందుఁ గారింపంగా
మూఁగినకుసుమశరంబుల
చేఁ గజకఱఁ గందె నతివచిత్తం బంతన్.

99


వ.

ఇట్లు హృదయంబునం కదిరినమదనానలంబుచే నుదిలగొని యాసుదతి
చిత్రరేఖ కిట్లనియె.

100


చ.

ఉడిగి మడింగి మైమఱచి యున్నతఱిం గలలోనఁ జేరె నె
క్కడిమగవాఁ డొకో! యనుచుఁ గందఁగ మేల్కొ.నుచో నతండ యి

  1. నెఱి యె
  2. సొరువయ్యెన్