పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒప్పుకోళ్ళను చేయు వ్యక్తులకు ప్యతిరేకముగా మరియు వారిచే లేక వారితరపున వాటిని రుజువుచేయుట.

21. ఒప్పుకొళ్ళు, సంబద్దములగును; మరియు వాటిని చేయు వ్యక్తికి లేక అతని హిత ప్రతినిధికి వ్వతిరేకముగా వాటిని రుజువు చేయవచ్చును. కాని వాటిని ఈ క్రింది సందర్బములలొ తప్ప, వాటిని చేసిన వ్యక్తి గాని ఆతని తరపున గాని, అతని హిత ప్రతినిధి గాని రుజువు చేయరాదు:—

(1) ఒప్పుకొలు, స్వభావమునుబట్టి దానిని చేసిన వ్యక్తి మరణించియుండినచొ అన్య వ్యక్తుల మద్య 32వ పరిచ్చేదము క్రింద అది సంబద్దమ్టై యుండెడిదై నప్పుడు, ఆ ఒప్పుకొలును దానిని చేసిన వ్యక్తిగాని అతని తరపునగాని రుజువు చేయవచ్చును.

(2) ఒప్పుకోలు, సంబద్దమైనదిగా లేక వివాదాంశముగా ఉన్న ఏదేని మానసిక లేక శారీరక స్టితిని గూర్చిన కథనమ్తైనదిగా ఉండి ఆ కథనము అట్టి మానసిక లేక శారీరక స్థితి ఉన్న సమయమున లేక తత్సమీపకాలమున చేయబడినదై ప్రవర్తనను బట్టి అబద్దమగుటకు అస్కారము లేనిదైనపుడు ఆ ఒప్పుకోలును చేసిన వ్యక్తి గాని అతని తరపున గాని రుజువు చేయవచ్చును.

(3) ఒప్పుకోలు ఒక ఒప్పుకోలుగా గాక అన్యథా సంబద్దమైన దైనచొ ఆ ఒప్పుకోలు. దానిని. చేసిన వ్యకిచేగాని ఆతని తరపునగాని రుజువు చేయబడవచ్చును.

ఉదాహరణములు


(5) ఒకానొక పత్రము కూట రచితమా కాదా అనునది 'ఏ' 'బీ' ల మధ్య గల ప్రశ్న. 'ఏ' అది కూట రచితము కాదనియు 'బీ' అది కూట రచితమనియు ద్రువముగా చెప్పుదురు,

పత్రము కూట రచితము కాదని 'బీ' చేసిన కథనమును' 'ఏ' రుజువు చేయవచ్చును, మరియు పత్రము కూట రచితమని. 'ఏ' చేసిన కథనమును 'బీ' రుజువు చేయవచ్చును. కాని పత్రము కూట రచితము కాదని 'ఏ' తాను చేసిన కథనమును తానే రుజువు చేయరాదు; మరియు పత్రము కూట రచితమని 'బీ' తాను చేసిన కథనమును తానే రుజువు చేయరాదు.

(బీ ) ఒక నౌక యొక్క కెప్టెను ఆయిన 'ఏ' ఆ నౌకాభంగము విషయమున విచారణ చేయబడుచుండెను.

సరియైన మార్గమునుండి నౌక మళ్ళింపబడిన దనుటకు సాక్ష్యము ఈయబడినది.

మామూలు వ్యవహార సరళిలో తనచే ఉంచబడి దినదినము. తనచే (నాసికొనబడినవనే గమనికలను జూపుచు ఆ నౌకను సరియైన మార్గము నుండి మరలించలేదని తెలియజేయునట్తి పుస్తకమును. 'ఏ' దాఖలు చేయును. 'ఏ' గనుక మరణించి యుండినచో, 32వ పరిచ్చేదవు ఖండము (2) (కింద అన్య వ్యక్తుల మధ్య ఈ కథనములు న్వీకార యోగ్యమై. యుండెడివి, అందుచే అతడు వాటిని రుజువు చేయవచ్చును.

(సీ) కలకత్తాలో 'ఏ' ఒక నేరముజేసెనని అతనిపై నేరము మోపబడినది.

తనచే అదే దినమున లాహోరునందు (వాయబడి, తేదీ వేయబడి ఆ' దినపు లాహోరు తపాలా ముద్రగలిగిన ఒక జాబును ఆతడు దాఖలు చేయును,

ఆ జాబు యొక్క తేదీలోని కథనము 'ఏ' గనుక మరణించి యుండినచో 32వ పరిచ్చేదపు ఖండము (2) క్రింద స్వీకార యోగ్యమై. యుండెడిది. అందుచే అది స్వీకార యోగ్యమగును,

(డీ) దొంగిలింపబడిన సరుకులను దొంగిలింపబడినవని ఎరిగియుండియు తీసికొనెనని 'ఏ' పై నేరము మొపబడినది.

వాటి విలువకంటె తక్కువకు వాటిని విక్రయించుటకు నిరాకరించితినని అతడు రుజువు చేయగోరుము.

ఈ కథనములు ఒప్పుకోళ్ళే అయినప్పటికిని వివాదాంశ సంగతుల ప్రభావమునకు గురియైన ప్రవర్తనను అవి విశదీకరించునవిగా ఉన్నవి. అందుచే 'ఏ' వాటిని రుజువు చేయవచ్చును.

(ఈ) నకిలీ నాణెమని తెలిసియు. నకిలీ నాణెమును కపటముగా తన స్యాధీనమునందు ఉంచుకొనెనని 'ఏ' పై నేరము మోపబడినదిః

అది నకిలీ నాణెమా అని తాను సందేహించి, ఒక నిపుణునివే పరీక్షింపజేసితిననియు, ఆ నిపుణుడు. దానిని పరీక్షీంచి అది నకిలీ నాణెము కాదని తనకు చెప్పెననియు, అతడు రుజువు చేయగోరును.

పై కడపటి ఉదాహరణములో చెప్పబడిన కారణములను బట్టి 'ఏ' ఈ సంగతులను రుజువు చేయవచును,