బ్రస్తారప్రత్యయము
గీ. | వరుస సర్వగురువు లుంచి గురువుక్రింద, లఘువు నవతలఁ బైబండిలాగు వ్రాసి | 89 |
తా. | ఎన్నవఛందము ప్రసరింపవలె నన్న నన్ని గురువులు వరుసఁగ వ్రాసి యందు తొలిగురువు క్తింద లఘువును నావలఁ బైబంతి యెట్లున్నదో యామేరకు వ్రాసి దాపట గురువు వాసినఁ బ్రస్తారమగును. ఇట్లు సర్వలఘువు లగువఱకు వ్రాయునది. | |
అధ్వప్రత్యయము
గీ. | అమర నుక్తాది యిన్నిఛందములవఱకు | 90 |
తా. | మొదటిఛందస్సు మొదలుకొని యిన్ని ఛందస్సులవఱకు నెన్ని వృత్తము అనిచో నడిఛందస్సుకుమాత్ర మెన్నివృత్తము లున్నవో యవి రెట్టించి | |
నష్టప్రత్యయము
గీ. | పలుకఁబడు లెక్కభాగ మేర్పడినలఘువు, వ్రాసి బేసైన నొక్కటి వ్రాసిఁ గూర్చి | 91 |
తా. | ఎన్నవవృత్త మేరీతి నుండు నని యడిగిన నాలెక్క భాగించి సరిగా నున్నలఘువు వ్రాసికొని బేసిగానుండిన నొకటి కూర్చి భాగించి యందుకు గురువు వ్రాసికొనునది. ఇట్లు కడదనుక భాగించుకొని గురువు లఘువు వ్రాయుచు వచ్చినట్లయిన నది నష్టప్రత్యయ మగును. | |
సంఖ్యాప్రత్యయము
గీ. | వెలయ నీఛందమున కెన్నివృత్తము లని, యడుగ నేకోత్తరంబుగా నదివఱకును | 92 |
తా. | ఈఛందమున నెన్నివృత్తములు పుట్టు నని యడిగిన నెన్నవఛందము చెప్పుచున్నాఁడో యదివఱకు నేకోత్తరవృద్ధిగా రెట్టించి కడనువచ్చిన లెక్కను రెట్టించి యిన్నయని చెప్పునది. | |
ఉద్దిష్టప్రత్యయము
గీ. | వృత్తమున గురులఘువులు పేర్చి దాని క్రింద నేకోత్తరర్థి లెక్కించి యాల | 93 |