సీ. | కటికిచీఁకటి తిండి కరముల గిలిగింత నెవ్వాఁడు తొగకన్నె నవ్వఁ జెనకు.... | 80 |
వ. | అని యున్నది గనుక జాడ తెలియునది. | 81 |
గీ. | అగును స్త్రీలింగశబ్దంబు హ్రస్వముగ స, మాసమధ్యంబునను రంగ మనుజవిభుని | 82 |
తా. | గంగాజలము, గంగజలము; తమసాతీరము, తమసతీరము; రాకాచంద్రుఁడు, రాకచంద్రుఁడు, నదీసుతుఁడు, నదిసుతుఁడు అని యీరీతి స్త్రీలింగశబ్దములు అకారాంత, ఇకారాంతశబ్దములవలె నుండవచ్చును. | |
చ. | జలరుహనాభ రమ్యగిరిసానువనంబుల వేఁట లాడుచున్ | 83 |
క. | నెలకొనియె వేఁటతమి న, బ్బలియుఁడు శిశిరనగరుచిరపరిసరమహిమం | 84 |
ఉ. | రాకసుధాంశుమండలమురాకకు మాఱుమొగంబు పెట్టుచో | 85 |
వ. | అని యున్నది గనుక జాడ తెలిసికొనునది. | 86 |
వృత్తరత్నాకరప్రకరణము
క. | క్షితి వృత్తనియమములసం, గతి విద్వజ్జనము లెన్న గణబద్ధములై | 87 |
గీ. | ధరను బ్రస్తార మనఁగ నధ్వం బనంగ, నష్టమన సంఖ్యయనఁగ నుద్దిష్ట మనఁగ | 88 |
తా. | ప్రస్తారప్రత్యయము, అధ్వప్రత్యయము, నష్టప్రత్యయము, సంఖ్యాప్రత్యయము, ఉద్దిష్టప్రత్యయము, లగక్రియాప్రత్యయము, అని యాఱువిధముల ప్రత్యయము లొప్పును. అందుఁ | |
- ↑ నున్మిష, న్నలిన.