| అశ్వోత్తమము, అశ్వోత్తముఁడు; గజేంద్రము, గజేంద్రుఁడు; అనియు నిదియఁ గాక ఉరగము, ఉరగుఁడు; సముద్రము, సముద్రుఁడు; ఘనము, ఘనుఁడు; అనియుఁ జెప్పవచ్చును. | |
ఉ. | అగ్గురునందనుండు హరిణావళిఁ గాంచి కుభృత్తటంబు వే | 64 |
మ. | వివిధోత్తుంగతరంగఘట్టనచలద్వేలావనైలావళీ | 65 |
క. | గిరిశృంగతుంగవిగ్రహుఁ, డురుతరసత్త్వుఁడు విహంగమోత్తముఁ డపు డొ | 66 |
చ. | అరిదితపోవిభూతి నమరారులఁ బాధలు వొందకుండఁ దా | 67 |
క. | మృగయార్థ మరిగి హిమవ, న్నగభూములయందుఁ బవననందనుఁ డొకప | 68 |
వ. | అని యీతీరున విస్తారముగా నున్నది గనుకఁ దెలిసికొనఁదగినది. | 69 |
గీ. | పడెఁ బఱచెఁ బట్టెఁ బాటను నుడువు మెకట, సంస్కృతంబునఁ జెల్లును శత్రువులను | 70 |
తా. | పడె, పఱచె, పట్టె, పాటు ఈ నాల్గుశబ్దములు సంస్కృతపదములన్నిటియందుఁ జేరియుండవచ్చును. సుఖపడె, సుఖపఱచె, సుఖపెట్టె; దుఃఖపడె, దుఃఖపాటు, దుఃఖపెట్టె, దుఃఖపఱచె; సంకటపడె, సంకటపఱచె, సంకటపెట్టె; భంగపడె, భంగపెట్టె, భయపఱచె; అని యిటువంటిశబ్దములమీఁద నొకసమాసమువలె నుండవచ్చును. | |