మ. | వెర వేసంపదఁ గోరి గాండివగుణావిర్భూతబాణాళి కి | 13 |
క. | జన్నములు సేయునెడఁ బ, క్వాన్నంబులు గుడుచుచుండు మధిపతి నిన్నున్ | 14 |
వ. | అని యున్నది గనుకఁ దెలియునది. | 15 |
గీ. | క్రియలతుది రేఫ పొల్లగుఁ గృతులయందు, మదిఁ దలంతు ర్విపక్షభూమండలేంద్ర | 16 |
తా. | ఏతురు, ఒప్పుదురు, తునుముదురు, చూతురు, ఖండింతురు అనునీమొదలగు ఋకారాంతశబ్దముల రేఫ పొల్లుగాఁ గూడ నుండవచ్చును. | |
మ. | పరిహాసంబునఁ దేలి భృత్యులయెడన్ బ్రహ్లాదముం జెందు భూ | 17 |
క. | అప్పరుసునఁ బెనఁగినరిపు, లిప్పుడు భారతరణోర్వి కెర యై పలువుర్ | 18 |
వ. | అని యున్నది గనుక జాడ తెలియునది. | 19 |
గీ. | క్రియ విభక్త్యవ్యయములు సంస్కృతములు గను | 20 |
తా. | క్రియలుగ నుండునవియు, విభక్తిరూపములుగ నుండునవియు, నన్వయములుగ నుండునవియు నగుసంస్కృతశబ్దములు తెనుఁగున నొక్కొక్కదిక్కున ననుకరణమునందుఁ బ్రయోగింపవచ్చును. | |
- ↑ మిన్నకుడిగి మగుడిపొమ్ము