తా. | పదాఱు+వన్నె=పదార్వన్నె; నలు+మోములు=నల్మోములు; వారు+పరమమునులు=వార్పరమమునులు; కను+కొనలు=కన్గొనలు; పలు+మాఱు=పల్మాఱు. అని యిట్లు నుకార రుకార లుకారము లంతమందుఁగ తెనుఁగుశబ్దములు సమాససంధిచేత ద్విత్వములు గూడ నగును. | |
క. | తెల్లంబుగను నకారపుఁ, బొల్లులకు న్నచ్చుసంధి పొసఁగుఁ గవులకున్ | 6 |
తా. | నకారపొల్లువెనుక నచ్చులయినయకారాదు లుండిన సంధి పొసఁగును. | |
మ. | అనిలం బాపురిపౌరచిత్తముల కత్యానంద మొందంగనం | 7 |
చ. | వరదుఁడు పార్థుశౌర్యవిభవంబున కాతనిధైర్యశక్తికి | 8 |
మత్త. | మానితం బగునాతపోమహిమం ద్రిలోకపరాభవం | 9 |
క. | వచ్చిన మునిపతి కెదురుగ, వచ్చి నమస్కృతు లొనర్చి వనితయుఁ దాను | 10 |
వ. | అని యున్నది గనుకఁ దెలియఁదగినది. | 11 |
గీ. | హల్లుతోఁగూడ సంధిగా నచ్చుపొసఁగు, నెలమి నానందరంగరాయేంద్రుతోడ | 12 |
తా. | ఏల+ఒక్కొ=ఏలొక్కొ; అలుక+ఒనర్చి=అలుకొనర్చి. అని హల్లు లైన కకారాద్యక్షరములతో నచ్చు లైనస్వరము లిముడ సంధి గూర్పవచ్చును. | |