7. 'ప్రతి’ అను నుపసర్గయందలి యచ్చుకు భీమన నృసింహపురాణమున —
సీ. గీ. |
ఉల్లసిల్లుచు మేలిమి యొప్పునప్పు, డబ్జగర్భునిమ్రోలఁ బ్రత్యక్షమయ్యె.
| 337
|
హల్లుకు భారతము, ఆరణ్యపర్వమున —
క. |
దక్షమఖక్షయకరు నిట, లాక్షజహుతవహనభక్షితానంగు విరూ
పాక్షు మహోక్షధ్వజుఁ బ్రత్యక్షముగాఁ జేసికొనియెఁ దపముల పేర్మిన్.
| 338
|
8. ‘అపి” అను నుపసర్గయందలి యచ్చుకు పెద్దిరాజు హరికథాసుధారసమున —
క. |
శయధృతఫణివలయ భవా, వ్యయ విహితవిశుద్ధసంవిదాత్మక మాయా
మయ నానావిధలీలో, దయ సదయకటాక్ష శైలతనయాధ్యక్షా.
| 339
|
హల్లుకు నాచనసోముని హ(రి)రవిలాసమున —
క. |
జయవిజయవినుత జన్యా, వ్యయ దూరానందరూపభాసురదత్తా
భయ హరిహయముఖనిర్జర, నయనన్నక్షత్రయూథ నళినీనాథా!
| 340
|
9. 'ని' అను నుపసర్గయందలి యచ్చుకు రాజశేఖరచరిత్రమున —
ఉ. |
సాహసికాగ్రగామి నృపసత్తముఁ డట్లు తదీయఘోరమా
యాహిమికల్ హరింపుచు నిరంకుశవిక్రమకేళిఁ జూప ను
త్సాహముఁ దక్కి యాత్మపురిచక్కటి నొప్పెడు నొక్కకాళికా
గేహముఁ జొచ్చి తద్దనుజకీటము పాటిలుభీతి పెంపునన్.
| 341
|
హల్లుకు శ్రీనాథుని నందనచరిత్రమున —
సీ. |
రామానుజుండు నిరంతరము పదాఱువేల నూ టెనమండ్రువెలఁదు లతని...
| 342
|
10. ‘దు' అను నుపసర్గయందలి యచ్చుకు శ్రీరంగమాహాత్మ్యమున —
ఉ. |
అంత నిరంతరంబును దురంతసమున్నతిమంత మయ్యె హే
మంత ముదారవిస్ఫురితమంజులమౌక్తికజాలఝల్లరీ
కాంతలసత్తుషారకరకాపరిగుంభితభిల్లభీరుసీ
మంతము దుర్దమశ్రమవిమర్దితపద్మవనాంత మెంతయున్.
| 343
|
హల్లుకు భీమన హరవిలాసమున —
క. |
ఎంతయును దుస్తరంబు దు, రంతర సంసారవారిరాశి యది వెసన్
గంతుగొను మానవుం డొక, యింత శివస్మరణ చేసి యేచిన భక్తిన్.
| 344
|
11. 'అధి' అను నుపసర్గయందలి యచ్చుకు —
సీ. |
అగ్రజుచేత నధ్యాత్మరామాయణం బొకపరి విన జనులకును గలుగు...
| 345
|