హల్లుకు భారతము, ద్రోణపర్వమున —
చ. |
అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదుయోధవ
ర్గము మఱి యెవ్వరిన్ గొని పరాక్రమదుర్దమపాండుపుత్త్రసై
న్యములను మార్కొనం గడఁగె నక్కట! కౌరవు లేమి సేసిరో...
| 328
|
3. 'అవ' అను నుపసర్గయందలి మచ్చుకు భారతము, ఆనుశాసనీకపర్వమున —
క. |
నాయంగముల నెల్ల, బాయస మతిభక్తిఁ బూసి పాదతలమునన్
బూయవు కావునఁ గలుగు న, పాయం బరకాల నీకు నవిలంఘ్యం బై.
| 329
|
హల్లుకు భారతము, ఆదిపర్వమున —
క. |
భారతవంశాచార్యుఁడు, భారద్వాజుండు నా కపాయము సేసెన్
ఘోరాజి నతనినోర్చు న, పారపరాక్రమునిఁ బుత్త్రుఁ బడయఁగవలయున్.
| 330
|
4. 'సం' అను నుపసర్గయందలి యచ్చుకు భారతము, ఆనుశాసనీకపర్వమున —
చ. |
అమరఁగ రాజధర్మము సమాశ్రయ మై నడపున్ ద్రివర్గమున్...
| 331
|
హల్లుకు భారతము, ఆదిపర్వమున —
క. |
చల్లని దక్షిణమారుత, మల్లన వీతెంచి తగిలె నాలలనాధ
మ్మిల్లకుసుమాంగరాగస, ముల్లసితసుగంధి యగుచు మునివరుమీఁదన్.
| 332
|
5. 'అను' అను నుపసర్గయందలి యచ్చుకు భారతము, ఆదిపర్వమున —
క. |
నయమును ధర్మము గలయ, న్వయమున జనియించినాఁడ వక్కట ధర్మ
క్రియ యెఱుఁగంగావలయును, భయలోకవిరుద్ధ మైన పద మేమిటికిన్.
| 333
|
హల్లుకు బ్రహ్మాండపురాణమున —
సీ. |
నృపవరాగ్రణి విను మిఁక మీఁదఁ దానకాన్వయమున సారసనాభుఁ డుదయమంది దుష్టాత్ముల నణఁచు...
| 334
|
6. ‘సు' అను నుపసర్గయందలి యచ్చుకు భారతము, ఆరణ్యపర్వమున —
చ. |
వదనభుజోరుపాదయుగవర్ణచతుష్టయమున్ యుగాదియం
దొదవ సృజించు ఋగ్యజుషసూక్తులు సామ మధర్వణంబునన్.
| 335
|
హల్లుకు భారతము, ఆరణ్యపర్వమున —
ఉ. |
కప్పినయాదురాగ్రహము గర్వము ముంచుకొనంగ నాకు మున్
జొప్పడియెన్ సుధాసదృశసూక్తులఁ దేర్చితి వీవ యచ్యుతా
యిప్పుడు...
| 336
|