కళాపూర్ణోదయమున —
ఉ. |
కావునఁ జంద్రుఁ గింద్రుఁ జిలుకన్ గిలుకన్ బికమున్ గికంబునుం
గావు మటంచు వేఁడకుఁడు కీరపుజాతికిన్ బ్రియం
బే వివరింప మీకుఁ బలెఁ బెంచినజాతికి ముద్దుగాక పెన్
బావురుబిల్లికిన్ గలుగునా మొకమోట మొకింత చిల్క పైన్.
| 207
|
మన కూర్మ పురాణము; మలయమారుతమున —
క. |
తలిరాకుఁబోఁడినిడుక, న్గెలఁకులఁ గర్ణాగ్రపాళి నీలాంబురుహం
బల రె నది యెట్టులన దృ, క్కుల కిది తులగామిఁ జేరి కొలుచువిధమునన్.
| 208
|
భారతము, అశ్వమేధపర్వమున(1) —
చ. |
అనుమతి యింక వేఱె పడయన్ గత మెయ్యది కౌరవేంద్ర నన్
బనుపుము వాజిమేధకరణంబున కెయ్యది సేయువాఁడ నీ
యనుజులు...
| 209
|
వ. |
అని యున్నది గనుక నీజాడఁ దెలిసి యతులు చెప్పవచ్చును.
| 210
|
ప్రాదియతి
గీ. |
ప్రాదినిత్యసమాసశబ్దములు గాక, పెఱపదంబులపై యచ్చు బెరసినప్పు
డన్నియునుస్వరయతులగు సాంబశివుఁడు, శ్రీశుఁ డమరాన్వయాబ్ధిపూర్ణేందుఁ డనఁగ.
|
|
తా. |
సాష్టాంగము, సాహంకారము, సాంబశివుఁడు, సాంగోపాంగము, సాటోపము యివిమొదలైనవానియందు అద్యక్షరహల్లుతో అచ్చుకూడి ఉన్నందున హల్లునకైనను, అచ్చునకైనను యతియుండ జెప్పితే ప్రాదియతి యగును గనుక రెంటికి లక్ష్యము.
|
|
గీ. |
అమలభక్తితోడ సాష్టాంగముగఁ బూని, సాంబమూర్తి దివ్యచరణములకు
దాసులెల్ల మ్రొక్కుదారి మ్రొక్కిరి నీకుఁ, బ్రబలు లైనరిపులు రంగనృపతి!
| 212
|
మఱియు, కేతన కాదంబరియందు —
గీ. |
జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెఱఁగిన, నావిభుండు వాని లేవనెత్తి
కౌఁగిలించి వానిఁ గనుఁగొని కేయూర, కాభిధాన మొసఁగెఁ [2]గౌతుకమున.
| 213
|
నాచనసోముని హరివిలాసమున —
క. |
శంబరవైరివిభంజన, సాంబశివా యంధకప్రశాసక గజచ
ర్మాంబరధర యని నీదుప, దంబులు పూజించువాఁడు ధన్యుఁడుసుమ్మీ!
| 214
|
- ↑ ప్రతులలో ఇట్లే ఉన్నది గాని ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు
చెప్పినట్లున్నది (చూ. 1-92).
- ↑ కడుముదమున