పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/8

ఈ పుటను అచ్చుదిద్దలేదు

షత్తులు ప్రకృతిశ క్తిస్వరూపములను గ్రహించుటకు, నుపయోగించుటకు నాదికాలమున నుండియు మానవులు ప్రస్థానమును విశదము చేయుచున్నవి. ప్రాచీన కాలమునందువ లె వ ర్తమాన కాలమునందును విజ్ఞానో పార్ట నసంరక్షణములకై హిందూస్థానమును నితర దేశములవ లె విశ్వవిజ్ఞానమూర్తికి జ్ఞానాంజలులను సమర్పించుచున్నది. వేలకొలది సంవత్సరముల నుండియును పద క్రమ జటాఘనావధానవిధానమున మా త్రాభేదమైనను గలుగ కుండ సుస్వరో పేతముగ సంరక్షితమైన వైదిక విజ్ఞానము హిందువుల విజ్ఞాన ప్రియత్వమునకు లక్ష్యముగ నున్నది. వేదాధ్యయనమునం దాంధ్రులకు గల నిరుపమాన దక్షత్వ పరాకాష్ఠ వారివిజ్ఞాన ప్రియత్వమునకుపరమ ప్రమాణము. విశ్వవిజ్ఞానము దేశకాలపా త్రాతీతమై విశ్వశ్రేయ స్సునకు సాధనముగ నున్నది. మహాసామ్రాజ్యము లంత రించినను, యుగములు మాఱినను, మహానుభావులు గతించినను, జాతులు క్షీణించినను, దేశకాల పాత్రాతీత మైన విజ్ఞాన మవిచ్ఛిన్న ముగ వికాసమును బొందుచు మానవధర్మాభ్యుదయమును గలిగించుచున్నది. విజ్ఞానావ రణమునందు ప్రాచీన నవీన కాలభేదములును, ప్రాచ్య పాశ్చాత్త్య దేశ భేదములును, శ్వేత కృష్ణ జాతిభేదములును, స్త్రీ పురుష లింగ భేదములును, నిమ్నోన్నతకుల భేదములు ను సంతరించుచు విజ్ఞానాభ్యుదయ మవిచ్ఛిన్న ముగ గలుగు చున్నది. అనంతములైన జ్ఞానవాహిను లఖండమైన విజ్ఞా నార్ణవమునందు సంగమమును బడయుచున్నవి. విజ్ఞానార్ణవ మధనమునందు విజ్ఞానామృతము ప్రభవమై, జ్ఞేయమునకు సకలార్థసాధన మగుచున్నది. శ్రీరసాగరమధనో పాఖ్యానము విజ్ఞానోపార్జనో దంతమును మనోహరముగ వర్ణించుచున్నది. విశ్వ కల్యాణమహోత్సవమునకు చరాచర ప్రపంచమంతయును విజ్ఞానదీపికలను సమర్పించుచున్న విధమును విజ్ఞానకోశ ములు విశదము చేయుచున్నవి. ఆంగ్లేయుల భౌతిక సామ్రాజ్య ప్రతిష్ఠాపనమును ప్రపంచవ్యాప్తమైన బ్రిటిష్ సామ్రాజ్యమువలె, వారి విజ్ఞాన సామ్రాజ్య వ్యాపనమును బ్రిటానికా' యొక్క పదునాల్గు ముద్ర 'ఎన్ సైక్లోపీడియా ణములును చాటుచున్నవి. ఆదికాలమున నుండియును విజ్ఞానవికాసమునకు హిందువులు చూపిన శ్రద్ధాభక్తులను వైదిక విజ్ఞానము విశ దము చేయుచున్నది. వైదికమతము నాటిన విజ్ఞానాంకుర ములు కాలక్రమమున మహావృక్షములై వర్తమాన కాల మునందు అమూల్యమైన ఫలమును సమకూర్చుచున్న విధమును విజ్ఞాన చరిత్ర పరిశోధనములు విశదము చేయు చున్నవి. ఆదికాలమున వైదికమతానుష్ఠాన పరిణామము లందు మహర్షులు నిర్ణయించిన గణితము, జ్యోతిషము, గానము, వైద్యము, శిల్పము, వేదాంతము లగు మొద విజ్ఞాన బీజాంకురములు వర్తమాన కాలమునందు పాశ్చాత్త్యవిజ్ఞానరూపమున నవీన నామరూపములను గోచరం బైనను, విజ్ఞానపరిశోధనములు తత్స వాతన బీజ స్వరూపములను ప్రత్యక్షము చేయుచున్నవి. ఐతరేయ బ్రాహ్మణమునందలి వసిష్ఠ విశ్వామిత్ర సంవాదము విజ్ఞాన విజయగాథ నత్యద్భుతముగ వర్ణించుచున్నది. మానవాభ్యుదయమునకు మూలాధారమైన బ్రహ్మ జిజ్ఞాసయందు హిందూవిజ్ఞాన మగ్రస్థానమును వహించు చున్నది. ప్రపంచవ్యాప్తములైన మతములకు భరత వర్షము జన్మస్థానముగ పరిగణింపబడుచున్నది. వైదిక, జైన, బౌద్ధ, చార్వాకాది మతములకును, ద్వైతాద్వైత విశిష్టాద్వైతాది సిద్ధాంతములకును, భక్తి జ్ఞాన వైరాగ్య