పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

రున "అంధ్ర" దేశమని పేరుపెట్టి రనుట కల్ల. అట్లు వచ్చిరని కాని కృష్ణా గోదావరీ, నదీప్రాంతదేశముల నాక్రమించిరని కాని యొక్క వాక్యమైనను ఐతి రేయ బ్రాహ్మణమునందు గాని లేక మరియే సంస్కృత గ్రంధమందు గాని కానరాదు. వారును వారి సంతానపరంపరయు చౌర్య హింసాదులు వృత్తిగా గలవారైన అంధ్రాది దస్యుజాతులలో చేరిపోయిరని చెప్పుటయే ఐత రేయ బ్రాహ్మణ వాక్యముయొక్క పరమావధి. ఐత రేయ బ్రాహ్మణ వాక్యము కేవలము జాతివాచకము. అనగా అంధ్రత్వాది జాతులకు ఆర్యులలోగల "హోదా లేక అంతస్తు"ను చెప్పి అట్టివారిలో విశ్వామిత్రుని జ్యేష్ఠకుమారులు చేరిపోయి రని చెప్పెను. అటుతరువాతి కథయంతయు పాశ్చాత్యచరిత్రకారులవలన కల్పింపబడిన అసత్యచరిత్ర. దానిచే మన హైందవ చరిత్రకారులు దేశభాషలలోని కనువదించుచు ప్రచారమునకు దెచ్చుచుండిరి.

భార్గవ గోత్రజుడైన శునశ్శేఫుడు

ఇతడు "దేవరాతుడ"ను పేర కౌశికగోత్రములో ప్రవరుడయ్యెను. "వైశ్వామిత్ర, దైవరాత, జౌదల"అనియు 'వైశ్వామిత్ర, దైవరాత, దేవల' అనియు భార్గవ గోత్రజుడైన శునశ్శేఫుడు దైవరాతుడను పేరున విశ్వామిత్ర గోత్రములో ప్రవరుడైనందున విశ్వామిత్ర గోత్రమున ప్రవరాంతరము కలిగియున్నది. విశ్వామిత్ర (లేక కౌశిక) గోత్రమునకు "వైశ్వామిత్ర, అఘమర్షణ, కౌశిక" యనునది ప్రవర యైయున్నది. ఈవిధముగా శునశ్శేఫునివలన విశ్వామిత్రగోత్రము లేక కౌశికగోత్రములో ప్రవరాంతరము కలదు. ఆప్రవరలను చెప్పుకొనుచుండిన బ్రాహ్మణ కుటుంబములనేకములు ఆంధ్రదేశమున గలవు. గోత్రప్రవరలను పోగొట్టుకొని విశ్వామిత్రుని జ్యేష్ఠకుమారులును వారి సంతానమును నామరూపములు లేనివారైపోయిరి. కాలము గడచుచుండ క్రమక్రమముగా ఆ యారణ్యక బాహ్యజాతులన్నియు నశించి పోయినందున ఆజాతీయు లీకాలమున కాన్పించుట లేదు.