పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

ఆర్యులకురువర్ష (ఇప్పటి మధ్యఅమెరికా) నివాసము

చాతుర్వర్ణ్య ఆర్యులు అనులోమ విలోములతోకలిసి భారతవర్షము లగాయతు తూర్పుగా సముద్రమున మునిగిపోయిన లెమూరియా ఖండమును దానిగుండా మధ్య అమెరికా భాగములాక్రమించి నివసించిరి. అమెరికాలో అతిప్రాచీన కాలమునుండి నివసించుచుండిన "ఎర్రఇండియను" (Red Indians) లనబడెడివారందరు భారతవర్షమునుండి బహుప్రాచీన కాలమున వలసపోయి నివసించిన చారుర్వర్ణ్యస్థులైన వైదికార్యు లని తెలియవలెను. వారియిండ్లలో సుమారు నాలుగైదువేల సంవత్సరములకు పూర్వము వెలిగింపబడి అప్పటినుండియు నారాధింపబడుచుండిన అగ్నిహోత్ర మీనాటికిని బూజింపబడుచుండినది. నిత్యము ఉదయముననే స్నానమొనర్చి "సోమము" అనుపేరున ఒక తీగెను దంచి తీయబడిన రసమును అగ్నిహోత్రములో పోసి నమస్కరించి వారి పనులకు వారు పోవుచుందురని శ్రీ చమన్‌లాలు మహాశయుడు తన "హిందూఅమెరికా" అనెడి గ్రంథములో వ్రాసియున్నాడు. ఆయన స్వయముగా అమెరికాలో, ఎర్రయిండియనుల యిండ్లలో బసచేసి వారి ఆచారవ్యవహారములను స్వయముగా అవగాహన చేసికొనియున్నవాడు. ఎర్రఇండియను లందరు దక్షిణభారతమునుండి పోయిన ఆంధ్రులు ద్రవిడులు మొదలగువారలును, నేపాలుప్రాంత వాసులగువారలు కొందరును కలిసి యుండి రని వ్రాసియున్నాడు. ఈవిధముగా ఆంధ్రులనబడెడి వైదికార్యులు దక్షిణ భారతమునుండి "లెమూరియా" యనబడు పసిఫిక్కు మహాసముద్రముగా మారిపోయిన ఖండమును, దానికి దక్షిణముగా గల సుమిత్రా, జావా మొదలుగాగల ద్వీపములను అమెరికాఖండములో చాలభాగమును ఆక్రమించి కోట్లసంవత్సరముల క్రిందటనే అచ్చట నివసించిరి. ఇప్పు డాంధ్రులని పిలువబడెడివారలు స్వచ్ఛమైన ఆర్యజాతివా రైయున్నారు. వారు పోయినివసించిన ప్రదేశమునకు "ప్రాచ్యకదేశమ"ను, పేరు కలిగినప్పుడు వీరు "ప్రాచ్యక" జాతీయులని (తూర్పుభారతమున నివసించిన ఆర్యులని) పేరు కలిగినది. పిమ్మట "ఆంధ్రరాజు" తనకు భాగలబ్ధమైన ప్రాచ్యక రాజ్యభాగమునకు