పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

వర్ష భాగమునకు "మ్లేచ్ఛస్థాన" మని పేరు పెట్టబడినది. దీనిని మ్లేచ్ఛ ఖండమనియు పిలిచెడివారు.

మ్లేచ్ఛార్యుల ప్రపంచవ్యాప్తి

అట్లు దేశవిభాగ మొనర్చి యీయబడినను శక, యవన, హూణాదులైన మ్లేచ్ఛార్యులు చౌర్య హింసాదులు ప్రధానవృత్తిగా పెట్టుకొనుటచేతను అందును వారు వీరులైన సూర్యవంశ క్షత్రియు లగుటచేతను నిరంతరము భరతఖండముమీదకు దండెత్తివచ్చి అందినపట్టణములను పల్లెలను దోచుకొనుచు, స్త్రీల నెత్తికొనిపోవుచు ఆర్యులకు నిరంతరము హాని చేయుచుండెడివారు. ఆర్య రాజులు వీరిమీదకు దండెత్తి వీరిని అదుపులో నుంచుచుండెడివారు. క్రమ క్రమముగా వారలు పశ్చిమ, ఉత్తర ఆసియా ఐరోపా దేశములకు పోయి అచ్చట నివసించి రాజ్యస్థాపనము చేసియుండిరి. అట్లు పోయినవారిలో యవనులు నేడు గ్రీసు అని పిలువబడు చుండిన ప్రదేశమున నివసించి దానికి "అయోనియా" అని పేరిడిరి. భారతదేశములోని కాశ్మీరమునకు పశ్చిమమున గల అభిసార, ఉరగ, సింహపుర, దివ్యకటక, ఉత్తరజ్యోతిష-అను అయిదును భారతయవన రాష్ట్రములై యున్నవి. పిమ్మట క్రీ. పూ. పదవసతాబ్ద ప్రాంతమున గ్రీకులనెడి అనాగరికులగు మోటుజాతివారు వారినిజయించి వారితో పాటందు నిలిచి దానికి "గ్రీసు" అని పేరును మార్చియుండిరి. గ్రీసువారి నాగరికత భారతవర్షమునుండి మ్లేచ్ఛ యవనక్షత్రియులవలన కొంపోబడినదై యున్నది. వీరుకేవలము గుంపులుగా పోయి రాజ్యస్థాపనము చేసియుండి రనునది పొరబాటు. వీరికి రాజులుండెడివారు. వారి రాజుల యaజమాన్యముననే దండయాత్రలు జరుగుచుండెడివి.

భరతవర్షములోని ఆర్యరాజులు ఈశక యవనాది మ్లేచ్ఛక్షత్రియ వీరులను తమసైన్యములో నొకభాగముగా చేర్చుకొనెడివారు. వీరందరాయుధోప జీవులైనందున తమకు జీతములిచ్చి పోషించెడి రాజులవద్ద సైన్యములలో జేరి వారికిగాను యుద్ధములలో పాల్గొని ప్రాణము