పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/33

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

31

3. శ్రీ సి. సోమసుందరరావుగారు

శ్రీమతి ప్రతిభ చిన్నప్పగారు

(అ) కాకతి వీరరుద్రుని ఉత్తరేశ్వర తామ్రశాసనము (ఆంధ్రేతిహాస పరిశోధక మండలి పత్రిక (తెలుగు) (అచ్చులోనున్నది)

4. శ్రీ సి. సోమసుందరరావుగారు

(అ) గాంగ మూడవ వజ్రహస్తుని నందబలగ తామ్ర శాసనము (ఎపిగ్రాఫియా ఆంధ్రికా0 (ఇంగ్లీషు) (అచ్చులోనున్నది)

IV. సంస్కృతి - కళ

1. డా.కె. సుందరంగారు

(అ) సింహాచల దేవాలయము (పీ హెచ్.డి. సిద్ధాంత వ్యాసము)

2. శ్రీ బి. మస్తానయ్య

(అ) ముఖలింగ దేవాలయములు (పీ హెచ్.డి. సిద్ధాంత వ్యాసము - సమర్పించుటకు సిద్ధముగా నున్నది)

హిందీ శాఖ

సాహిత్యాచార్య ప్రొఫెసరు జి.సుందరరెడ్డిగారు అవిరళకృషి ఫలితముగా 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయములో హిందీ భాషాసాహిత్యముల అధ్యయన, పరిశోధనల స్నాతకోత్తరశాఖ (Department of Postgraduate Studies and Research in Hindi) ప్రారంభమైనది. ఈ శాఖద్వారా హిందీభాషాసాహిత్యాల అధ్యయనముతోపాటు హిందీ - తెలుగు సాహిత్యముల తులనాత్మక పరిశోధన ఇతోధికముగా జరుగుచున్నది. హిందీ - తెలుగు సాహిత్యముల సమానంతర ప్రక్రియలను, విశేషాలను తెలిసికొనుటకు ఈ విధమైన తులనాత్మక పరిశోధన ఎంతగానో తోడ్పడుతుంది. ఏ విషయమునయినను సరిగా అవగహన చేసికొనుటకు మాతృభాషాపరిజ్ఞానము ఎంతో అవసరము.

హిందీశాఖ ప్రారంభమై కేవల మొక దశాబ్దమే అయినను ప్రొఫెసర్ జి. సుందరరెడ్డిగారు పర్యవేక్షణలో ఇంతవరకు 12గురు పరిశోధకులకు పీ హెచ్.డి. డిగ్రీలు లభించాయి. వీరిలో 10 మంది హిందీ - తెలుగు సాహిత్యములలో తులనాత్మక పరిశోధన చేశారు. ఇద్దఱు మాత్రము కేవలము హిందీలోనే పరిశోధన చేసిరి. హిందీశాఖలో పరిశోధన చేయువారందరు తమ సిద్ధాంత వ్యాసములను హిందీలోనే వ్రాయుదురు. పీ హెచ్.డి. డిగ్రీ పొందినవారి వివరణ పట్టిక క్రింద చూపబడినది.