ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి
15. 'ఆంధ్ర శాసన సారస్వతము లందలి ఉర్దూ మరాఠీ పదములు (క్రీ.శ. 1800 వఱకు)' (1967)
రచయిత : డా.ఎల్. చక్రధరరావుగారు
పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు
ఆంధ్ర సాహిత్యము నందును, తెలుగు శాసనము లందును ప్రయుక్తమైన ఉర్దూ, మరాఠీ, ఒరియా భాషా పదముల చరిత్రము వివిధ కోణముల నుండి పరిశీలించిన సిద్ధాంత వ్యాసము.
16. 'తెనాలి రామకృష్ణుని గ్రంథములు' (1967)
రచయిత : డా.ఇ. కృష్ణమాచార్యులుగారు
పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు
తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం గూర్చి సంపూర్ణ పరిశోధనయిది.
17. 'నన్నెచోడుని కుమార సంభవము' (1967)
రచరిత్రి : డా.టి. నిర్మలగారు
పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు
నన్నెచోడుని కుమార సంభవం గురించి యిది సమగ్ర పరిశోధన.
18. 'తెలుగులో ఉత్తర రామాయణములు' (1968)
రచయిత : డా.ఎం. పాండురంగారావుగారు
పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు
తిక్కన, కాచవిభుడు విఠలరాజు, కంకంటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణముల సమగ్ర సమీక్ష యిది.
19. 'పాల్కురికి సోమనాథుఁడు - అతని గ్రంథములు' (1969)
రచయిత : డా.పి. ఏరేశలింగంగారు
పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు
వీరశైవ రచయితలలో అగ్రగణ్యుడైన పాల్కురికి సోమనాథుని గ్రంథములన్ని యిందులో పరిశీలింపబడ్డవి.
20. 'కరుణ రసము - ఆంధ్ర వాఙ్మయము' (1970)
రచయిత : డా.ఎస్. రాధాకృష్ణగారు
పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు
ఆంధ్ర వాఙ్మయములో కరుణరస పోషణ ఏయే గ్రంథాలలో ఏయే విధంగా ఉందో, ఇందులో విశదీకరింపబడి యున్నది.