పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

21

ఈ సిద్ధాంత వ్యాసంలో 16 భాగాలుకలవు. పింగళచ్చందస్సు మొదలైన వాటి దగ్గర్నుంచి ఆంధ్రలో అప్పకవీయాదులవరకు ఛందశ్శాస్త్రం ఏవిధంగా అభివృద్ధి చెందిందో దానిమీద కర్ణాట తమిళ భాషా ఛందోరీతుల ప్రభావం ఎటువంటిదో ఇందులో సమగ్రంగా వివరింపబడింది.

10. 'ప్రాఙ్నన్నయ యుగ ఆంధ్ర శాసన భాష చారిత్రక వ్యాకరణము' (1965)

రచయిత : డా. బూదరాజు రాధాకృష్ణగారు

నన్నయకు సమకాలికములును పూర్వకాలికములు నయిన సర్వాంధ్ర భాషాశాసనములలోని భాషా స్వరూపమును చారిత్రక పద్ధతిలో నిరూపించిన సిద్ధాంతవ్యాసము.

11. 'శ్రీనాథుఁడు - చారిత్రకము - ఆంధ్రీకరణము' (1965)

రచయిత : డా.కె.శ్రీరామమూర్తిగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

శ్రీనాథుని జీవితం గురించి, ఆ మహాకవి గ్రంథాల గురించి ఇందులో సమగ్రమైన పరిశోధన ఉన్నది.

12. 'ఆంధ్ర వ్యాకరణము - అవతరణ వికాసములు' (1966)

రచయిత : డా.బి. పురుషోత్తంగారు

పర్యవేక్షకులు : ఆచార్య జి.జె. సోమయాజులుగారు

ఆంధ్రలో ఉన్నటువంటి వ్యాకరణము లన్నింటి యొక్క సమగ్ర పరిశోధనయిది.

13. 'తెనుగు నందలి వకృతి పదముల స్వరూప నిరూపణము' (1966)

రచయిత : డా.టి. దొణప్పగారు

పర్యవేక్షకులు : ఆచార్య జి.జె. సోమయాజులుగారు

తెనుగు నందలి సంస్కృతభవ, ప్రాకృతసమ, ప్రాకృతభవముల సంపూర్ణ చరిత్రము, ధ్వనివిజ్ఞానము, రూపవిజ్ఞానము, అర్థవిపరిణామము, అను విభాగములక్రింద ప్రమాణోపపత్తి సంకలితముగ సమ్యగ్వీక్షణము గావించిన సిద్ధాంత వ్యాసము.

14. 'నాచన సోమనాథుఁడు - అతని రచనలు' (1966)

రచయిత : డా.వి. కామేశ్వరరావుగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

నాచన సోమనాథుని ఉత్తర హరి వంశమును గూర్చి సమగ్ర పరిశోధన యిది.