పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో

పరిశోధనలు

ఆంధ్రశాఖ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖలో ఆంధ్రుల సంస్కృతి గురించి జరిగిన పరిశోధన గురించి క్రింద విశదీకరింపబడుతున్నది. అనగా, సిద్ధాంతవ్యాసము పేరు, పిహెచ్.డి డిగ్రీ వచ్చిన సంవత్సరము సిద్ధాంతవ్యాస రచయిత పేరు, పర్యవేక్షకుని పేరు, ఆ వ్యాస విషయము, క్రమముగా క్రింద సూచింపబడుతున్నాయి.

సిద్ధాంత వ్యాసములు (Ph.D.theses):

1. 'ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు (1945)

రచయిత : డా.కె.వి. ఆర్. నరసింహంగారు

పర్యవేక్షకులు; ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు

ఈ సిద్ధాంత వ్యాసములో ఆంధ్ర వాఙ్మయమునందు మిక్కిలి ప్రసిద్ధిపొందిన ప్రబంధశాఖమొక్క అవతరణము, వికాసము 28 ప్రకరణములలో వివరింపబడియున్నది. తెలుగులో ఇది మొదటి సిద్ధాంత వ్యాసము. ఆంధ్ర విశ్వవిద్యాలయప్రచురణ.

2. 'ఆంధ్ర వాఙ్మయముపై ఆంగ్ల ప్రభావము' (1956)

రచయిత : డా.కె. వీరభద్రరావుగారు

పర్యవేక్షకులు: ఆచార్య జి.కె. సోమయాజులుగారు

17వ శతాబ్దినుండి 20వ శతాబ్దమువరకు ఆంధ్రభాషా వాఙ్మయములమీద ఆంగ్లమునకున్న ప్రభావాన్ని ఈ సిద్ధాంతవ్యాసము వివరిస్తున్నది. ముద్రితము.

3. 'ప్రాచీనాంధ్ర శాసనములు' (1956)

రచయిత : డా.టి.వి. నారాయణశాస్త్రిగారు

పర్యవేక్షకులు : ఆచార్య జి.జె. సోమయాజులుగారు

రేనాఁటి చోళుల దగ్గరనుండి ఉన్న ప్రాచీన శాసనాలు పరిశోధించి అందులో వృత్తగ్రంథులున్నాయని శ్రీ నారాయణశాస్త్రిగారు నిరూపించినారు.

19