అంగార
గంధర్వ రూపము దాల్చి చిత్రరథుడను నామాంతరమునఁ బరగినవాడు. భార్యపేరు కుంభీనస. ఈ చిత్రరథుని యుపదేశము మేరకు పాండవులు ధౌమ్యుని బురోహితుని గామించుకొనిరి.
అంగారవల్లి —— (వనౌషధి) సం. . Galadupa Arborea. వంటి అగ్గి వంటి ఎర్రని రంగు పూవులం బూచును. జాతిలోనిది. పెద్ద గానుగ, భారంగి, గురువింద యనియు నందురు. దీని చెక్క రసము వెగటుగను, చేదుగను ఉండి తేలిక నిచ్చును. జఠరవ్యాధిని పోగొట్టును. వెర్రి నక్క, వెర్రి కుక్క హరించును. విషములను కానుగ చెట్ల
అంగారోస్ జాతి - స్పానియా దేశమందు
గిప్సీ (హంగేరి దేశపు గిప్సీ) లకు పేరు.
అంగిట బెల్లము, ఆత్మలో విషము-
ఆంధ్రలోకోక్తి. పై కింపుగ వచించుట, మన స్సునందు కల్మషులైయుంట కీన్యాయము వచించుచుందురు.
అంగిమాగోత్రము చూడుడు. ఆత్రేయగణము
అంగిరస్సు — (ఘోర అంగిరస్సు) శ్రీకృష్ణు డీఘోర అంగిరస్సు అను మునీశ్వరుకడ శిష్యుడై జ్ఞానోపదేశము బొందినటుల ఛాం దోగ్యమున వివరింపఁబడినది. అట్లాతడు యంగిరస్సుకడ పొందిన జ్ఞానమునకును, గీతలలో దానుపదేశించిన జ్ఞానమునకును సంబంధము కానంబడనందున గీతోపదేశ కృష్ణుం డాకృష్ణుఁడు కాడేమోయని తిలకు మహాశయుడు తన గీతారహస్యమున వ్రాసి యున్నాడు. ఇట్లే రామకృష్ణ భాండార్దారు
8