పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోటు 1.16 శాతం. ఈ అంచనాలలో అవిభక్త రాష్ట్రానికి సంబంధించిన 2 నెలల ఆదాయ వ్యయాలు, రాష్ట్ర విభజనను పునస్కరించుకొని కేంద్రప్రభుత్వం నుండి అదనంగా వస్తాయని భావిస్తున్న 14,500 కోట్ల రూపాయలు ఇమిడివున్నాయి. వీటిని మినహాయిస్తే ఆర్థిక అంశాలపై ప్రకటించిన శ్వేతపత్రంలో పేర్కొన్న విధంగా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం శేష రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.25,574 కోట్లు, ద్రవ్య లోటు రూ.37,910 కోట్లుగా ఉంటాయి. ఇవి జి.ఎస్.డి.పి.లో వరుసగా 4. 84 మరియు 7.18 శాతం.

173. ఈ రానున్న సంవత్సర కాలంలో ముందంజ వేయడానికి వీలుగా కొత్త రాష్ట్రాన్ని సువ్యవస్థితంగా నిర్మించే ప్రక్రియకు 2014-15 బడ్జెట్ శ్రీకారం చుట్టనున్నదని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఆర్థిక వృద్ధి సాధనలో భాగస్వాము లందరికీసమానావకాశాలు కల్పించే మరియు సమాజం లోని అన్ని వర్గాల వారికీ ముఖ్యంగా బలహీన వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించే సమ్మిళిత వృద్ధి సాధనే మాధ్యేయం. ఈ సందర్భంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పలుకులను ప్రస్తావిస్తున్నాను. "ఒకానొక రోజు ప్రతిలోయ పైకెత్తబడుతుంది, ప్రతి పర్వతం క్రిందకు దిగుతుంది, ఎగుడుదిగుళ్ళు చదునవుతాయి, వంకర నేలలు తిన్నగా మారుతాయి - అన్నది నాస్వప్నం." పైలక్ష్యాలను చేరుకోవడానికీ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడానికీ మా ప్రభుత్వం నిరంతరాయంగా, అవిశ్రాంతంగా శ్రమించడానికి కృత నిశ్చయంతో ఉంది చివరగా రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క ఈ పద్య పాదంతో ముగిస్తున్నాను.

విశ్రమించడానికి ముందు పయనించాల్సిన దూరం ఎన్నో మైళ్ళు

విశ్రమించడానికి ముందు పయనించాల్సిన దూరం ఎన్నో మైళ్ళు

174. ఈ బడ్జెట్‌ను సభవారి ఆమోదం కోసం సమర్పిస్తున్నాను.


జై హింద్ !

54