పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అనువైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనున్నదని నేనీ సందర్భంగా తమ ద్వారా సభకు హామీ ఇస్తున్నాను.

2012-13 లెక్కలు 170. 2012-13 సంవత్సరానికి చెందిన తుది లెక్కల ప్రకారం రూ. 1,128 కోట్ల రెవిన్యూ మిగులు ఉండగా, రూ.17,508 కోట్లు ఆర్థికలోటు నమోదయింది. మొత్తం రాష్ట్ర స్థూలఉత్పత్తిలో 2.32 శాతం అయిన ఈ లోటు ఎఫ్ఆర్టిఎమ్ చట్ట పరిధి దాటలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.

2013-14 సంవత్సరానికి సవరించిన అంచనాలు

171. 2013-14 సంవత్సరపు సవరించిన అంచనాల లావాదేవీలనుబట్టి రూ.1023 కోట్ల రెవిన్యూ మిగులు సూచిస్తున్నది. ద్రవ్యలోటు రూ.24,487 కోట్లుగా అంచనా వేయడమయింది. ఇది జి.ఎస్. డి.పి.లో 2.87 శాతం.

2014-15 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు

172. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.1,11,824 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. అందులో రూ.85,151 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా, రూ.26,673 కోట్లు ప్రణాళికావ్యయంగా అంచనా వేయబడింది. రెవిన్యూ లోటు రూ.6,064 కోట్లుగా మరియు ఆర్థికలోటు రూ.12,064 కోట్లుగానూ అంచనా వేయబడింది. స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆర్థిక లోటు 2.30 శాతం కాగా రెవెన్యూ

53