పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్లే విధంగా అందుకు అనుసరించవలసిన విధానాలను సూచిస్తూ, ప్రభుత్వం ఒక బ్లూప్రింట్ రూపొందించింది.

154. శాఖ ముందున్న ప్రధాన లక్ష్యాలు : ప్రస్తుతం ఐటి రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందినవారు 21,795 మాత్రమే కాగా, అదనంగా ఐటి రంగంలో ప్రత్యక్షంగా 5 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన, సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల జాతీయ ఎగుమతిలో 5 శాతం వాటా సాధించడం, అంటే ప్రస్తుత రూ.1,622.20 కోట్ల విలువగల ఉత్పత్తుల ఎగుమతుల స్థానంలో రూ.43,000 వేల కోట్ల విలువ గల ఉత్పత్తుల ఎగుమతిని సాధించడం, ఐటి రంగంలో 2 బిలియన్ యుఎస్ డాలర్ల విలువగల పెట్టుబడులను ఆకర్షించడం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో 5 బిలియన్ యుఎస్ డాలర్ల విలువగల పెట్టుబడులను ఆకర్షించడం, వస్తూత్పత్తి కేంద్రాలను అనుసంధాన పరిచే సిలికాన్ కారిడార్ ను ఏర్పరచడం, అన్ని గ్రామాలను గిగాబిట్‌తో అనుసంధాన పరచి, ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్క వ్యక్తినైనా డిజిటల్ అక్షరాస్యుడిగా రూపొందించి, రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా రూపొందించడం.

155. ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో సమన్వయ పద్దతిలో ఆశించిన ఫలితాలను రాబట్టడం కోసం 18 విధాన పత్రాలు/ఫ్రేమ్ వర్క్లు, మరియు ఇ-గవర్నమెంట్ మిషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ప్రమోషన్ మిషన్ మరియు ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ అనే మూడు మిషన్లను కూడా నెలకొల్పడం జరుగుతున్నది.

156. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఐటి/ఐటిఇఎస్/ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగాలకు సంబంధించిన గమ్యస్థలంగా నలుగురూ కోరుకునే విధంగా రూపొందించడం కోసం ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టనున్నది. వాక్‌టు వర్క్ మరియు సైకిల్ టు వర్క్ పద్ధతిన మెగా ఐటి హబ్లను అభివృద్ధి పర్చడం ద్వారా అంతర్జాతీయ స్థాయి

48