పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78. ఎన్ఆర్‌డబ్ల్యుపి కింద 8901 జనావాసాలకు లబ్ధి చేకూర్చే 4071 ఎస్ఐఎస్/ ఎమ్ఐఎస్ పనులు పురోగతిలో ఉన్నాయి. 9 తీరాంధ్ర జిల్లాల్లో సెలినిటీ సమస్యను ఎదుర్కోవడం కోసం 13వ ఆర్థికసంఘం నిధులతో 47 బహుళగ్రామ పథకాలు పురోగతిలో ఉన్నాయి. ప్రపంచబ్యాంకు సహాయంతో 159 ఏకగ్రామ/బహుళగ్రామ పథకాలు పురోగతిలో ఉన్నాయి.

79 ప్రజలకు అందుబాటులోకి తెస్తున్న మంచినీటి నాణ్యతను మెరుగుపర్చే దిశగా రాష్ట్రప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేయాలనే ఒక బృహత్తర విధాన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికీ రెండు రూపాయలకు 20 లీటర్ల సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయనుంది. నీటి సరఫరాతో, నీటి సరఫరాకై ఏర్పాటుచేసిన పంపిణీ వ్యవస్థలతో, ఇళ్లల్లో నీటిని భద్రపరిచి, వినియోగించే అలవాట్లతో మంచినీటి నాణ్యతా సమస్యలు ముడిపడి ఉన్నాయి. 2 అక్టోబరు 2014 నుండి మొదటిదశలో భాగంగా 5000 జనావాసాల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేయడానికి ప్రతిపాదించడం జరిగింది.

80. ఇంతేకాక, ఒక వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ను నెలకొల్పి ఇంతవరకూ నెలకొల్పిన మంచినీటి సరఫరా సదుపాయాలన్నిటినీ ఈ కార్పొరేషనకు బదలాయించాలని కూడా నిర్ణయించనైనది. ఈ కార్పొరేషన్ అవసరమైన నిధులను సేకరించి రాష్ట్రమంతటా ఒక వాటర్ గ్రిడ్లు ఏర్పాటుచేయనున్నది.

81. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరుశాతం పారిశుధ్యం సాధించడం కోసం ప్రభుత్వం వ్యక్తిగత కుటుంబాల గృహాలకు, పాఠశాలలకు, అంగనవాడీ కేంద్రాలకూ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నది.

28