పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫలితాలను దృష్టిలో ఉంచుకొని దశలవారీగా అన్ని సంక్షేమ హాస్టళ్ళను రెసిడెన్షియల్ స్కూళ్ళుగా అభివృద్ధిచేయడానికి మేము కట్టుబడి వున్నాము. విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు మరియు పేద షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవరీసీస్ విద్యానిధి ఏర్పాటు చేయడం మరొక ముఖ్యమైన కార్యక్రమం.

30. షెడ్యూల్డ్ కులాల సాధికారికత దిశగా మరొక ముఖ్యమైన చర్య షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా ఆర్థికసహాయం అందించడం. ఈ ఆర్థికసహాయం ఏ.పి. షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సొసైటీ లిమిటెడ్ ద్వారా సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది.

31. షెడ్యూల్డ్ కులాల సాధికారికతకు చేపట్టిన మూడో ముఖ్యమైన చర్య షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికను అమలు పరచడం. సాధారణ ప్రజానీకానికీ, షెడ్యూల్డ్ కులాలకూ మధ్య అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాలను పూరించే దిశగా వ్యక్తులకూ, కుటుంబాలకూ, జనావాసాలకూ ప్రత్యక్షంగానూ, నిర్దిష్టంగానూ లాభించే వివిధ కార్యక్రమాలను సంబంధిత శాఖలు రూపొందించి అమలుచేసే విధంగా షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికను అమలుచేయడం జరుగుతున్నది. 2014-15 లో రాష్ట్ర జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా నిష్పత్తి మేరకు ఉపప్రణాళిక కేటాయింపులను 17.1 శాతానికి పెంచడం జరిగింది.

32. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2657 కోట్లు ప్రతిపాదించడమైనది.

15