పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికేంద్రీకరణ అంటే మరింత మెరుగైన పద్దతిలో సేవలను అందించడంగానే నేడు మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ దిశగా జిల్లాస్థాయిలో సేవలను మరింత మెరుగ్గా అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరింత మెరుగైన ప్రణాళిక, పాలన, ఆర్థికసేవా వ్యవస్థలను రూపొందించడానికి యోచిస్తున్నది.

20. ప్రణాళికా ప్రక్రియను కార్యక్రమ నిర్వాహకులు అవగాహన చేసుకోవడానికి వీలుగా ప్రణాళికల రూపకల్పనలోనూ, ప్రణాళికల వికేంద్రీకరణ లోనూ అత్యున్నత విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

21. కాగా ప్రస్తుత సంవత్సరానికి నేను పరిమితమైన అంచనాలు గల ప్రణాళికతో కూడుకున్న బడ్జెట్ ను మాత్రమే సమర్పించగలగుతున్నాను. గతం నుంచి మనకు లభించిన అనేక సమస్యలే ఇందుకు కారణం. అంతేకాక ఖచ్చితంగా ఆదాయపు వసూళ్లను లెక్కకట్టడంలో కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని కూడా నేను తమద్వారా సభ దృష్టికి తీసుకువస్తున్నాను. ప్రస్తుత బడ్జెటు మొదటి రెండు నెలలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, తక్కిన పది నెలలకూ శేషాంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని వివరించనున్నది. ఇందువల్ల వసూళ్లు మరియు వ్యయానికి సంబంధించిన అంచనాలు, ఆదాయం మరియు ఆర్థికలోటుకు సంబంధించిన అంచనాలు తీవ్రంగా ప్రభావితమవడం వల్ల ఎ.పి.ఎఫ్. ఆర్.బి.ఎమ్ చట్టంలో నిర్దేశించిన నిబంధనలను అనుసరించడం రాష్ట్రానికి కష్టసాధ్యమౌతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే భారతప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. మనం దాదాపుగా ఆర్థికసంవత్సరం మధ్యలో ఉన్నందున ఈ మిగిలిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం యొక్క అత్యవసర కనీస అవసరాలను తీర్చడం మీదనే ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెడుతున్నది. అయితే మిగిలిన ఆర్థికసంవత్సర

9