పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూలధన పంపిణీలకు గల కేటాయింపులతో కలిపి మొత్తం మూలధన వ్యయమును సుమారు రూ.47,582.73 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రెవెన్యూ లోటు సుమారు రూ. 5,000.05 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు రూ.37,029.79 కోట్లుగా అంచనా వేయడమైంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (G.S.D.P.) లో ద్రవ్య లోటు 3.49.% గాను, రెవెన్యూ లోటు 0.47% గాను ఉంటుంది.

ముగింపు మాటలు

88. అధ్యక్షా!

ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్దేశించబడిన, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉండటమే కాకుండా, మన ప్రభుత్వం కొత్త ఒరవడితో చేపట్టిన అమ్మ ఒడి, ఆసరా, చేయూత,ఆరోగ్యశ్రీ మరియు రైతు భరోసా వంటి పథకాలను కూడా లక్ష్య సాధన దిశగా ముందుకు తీసుకు వెళోంది.

89. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమిష్టి కృషి మరియు సహకారం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రిగారి నాయకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మన నాయకుని విశేషమైన శ్రమతో కూడిన ప్రయత్నాలు, నిర్ణయాత్మక విధానాలు మరియు సదుద్దేశంతో కూడిన చొరవ ద్వారా రాబోయే తరతరాలు తమ సొంత ఇల్లు' అని సగర్వంగా భావించేలా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుంది. మన రాష్ట్ర పౌరుల భవిష్యత్తుపై పెట్టుబడులు పెట్టడం మరియు వారి నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి వారికి అధికారం ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క నిరంతర ప్రయత్నంగా కొనసాగుతుంది.

90. కోవిడ్-19 మహమ్మారి మన ఓర్పుకు పరీక్ష పెట్టింది. ప్రపంచం గతంలో ఎన్నో కష్టసమయాలను చూసింది. మిగిలిన వాటికి, ఈ సంక్షోభానికి తేడా ఏమిటంటే

41