పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహకారం చేకూర్చడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మా ప్రభుత్వం విసృత బహుళ రంగ విధానం ఎంతో కృషి చేస్తూ ఉంది. స్థిరమైన జీవనోపాధిని సాధించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధిని విస్తరించి మన్నికైన ఆస్తులను సృష్టించడానికి, 24 లైన్ విభాగాలతో 'మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం' క్రింద ప్రభుత్వం వివిధ కన్వర్జెన్స్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2020-21 సం॥లో 2,593 లక్షల పనిదినాల కల్పనతోపాటు, 5,957 కోట్ల 60 లక్షల రూపాయల విలువగల వేతనాలు పంపిణీ చేయబడ్డాయి. ఇంతేగాక 68,367 వ్యవసాయ చెఱువుల త్రవ్వకం మరియు 29,965 నీళ్ళ ట్యాంకుల నుండి పూడికలను తొలగించడం జరిగింది. భవన నిర్మాణ సామగ్రిని అందించే సహకారంలో భాగంగా 235 కిలోమీటర్ల సి.సి. రోడ్లు ఏర్పాటు, పాఠశాలలకు 502 కిలోమీటర్ల ప్రహరీ గోడల నిర్మాణం, 2,406 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, 459 వై.యస్.ఆర్. ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, 577 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పూర్తిగావించడమైనది. వీటికి గాను 3,600 కోట్ల రూపాయలను ఖర్చు చేయడమైనది. ఇంతేగాక 56,762 ఎకరాలలో ఉద్యానవన మొక్కల పెంపకం, 10,700 కిలోమీటర్ల పొడవుగల రోడ్లకు ఇరువైపుల మొక్కల పెంపకం, 3,553 కిలోమీటర్ల పొడవుగల జగనన్న కాలనీలో ప్లాంటేషన్ చేయుటకు నిర్మాణ సామగ్రి అందించడం జరిగింది. ఈ విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పరిపాలన ఖర్చుతో కూడుకొని 10,200 కోట్ల 60 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

62. రాష్ట్రంలోని 162 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలలో, 1 లక్ష మంది రైతులకు లబ్ధిచేకూర్చే విధంగా 2.5 లక్షల ఎకరాల భూమిని నీటిపారుదల క్రిందకు తెచ్చేందుకు వై.యస్.ఆర్. జలకళ కార్యక్రమంలో భాగంగా 2 లక్షల బోర్లను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

31