పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏటా పదిహేను వేల రూపాయలు జమచేస్తోంది. విద్యార్జనకు పేదరికం అడ్డు రాకూడదని, గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్ముతారు. వరుసగా రెండవ సంవత్సరం, జగనన్న అమ్మఒడి పథకం క్రింద ప్రభుత్వం 44 లక్షల 49 వేల మంది తల్లులకు 15 వేల రూపాయలు చొప్పున అందించడంతో 84 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందారు. వరుసగా 2021-22 సం॥లో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 6,107 కోట్ల 36 లక్షల రూపాయల ఆర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయబడుతుంది.

నాడు-నేడు : పాఠశాలలకు మౌళిక సదుపాయాల కల్పన

“ప్రపంచాన్ని మార్చటానికి మీరు ఉపయోగించ గలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య” అన్నారు నెల్సన్ మండేలా.

52. మన బడి-నాడు నేడు పథకం క్రింద మన ప్రభుత్వం, 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నాణ్యమైన విద్య మరియు జీవిత కాల అభ్యసన అవకాశాలు కలిగించడం' సాధించే దిశలో పాఠశాలలలో 9 మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలలు ఇప్పటికే ఆధునీకరించ బడ్డాయి. 2021 ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే ఈ పథకం రెండవ దశలో భాగంగా 16,345 విద్యాసంస్థలు ఆధునీకరించబడతాయి. ఈ పథకం కోసం 2021-22 సం॥లో 3,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

53. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 1 నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు గుడ్డు, చిక్కి మొదలైన పోషక పదార్థాలను కూడా అందించడానికి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. జగనన్న విద్యాకానుక పథకం క్రింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో 1 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రెందు/మూడు జతల స్కూల్ యూనిఫారములు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, పాఠ్య పుస్తకాలతో పాటు నోటు మరియు వర్కు

26