పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40. 'దిశ' అమలులో భాగంగా, మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత దిశగా ప్రభుత్వం మహిళా రక్షకభట నిలయాలను 'దిశ రక్షకభట నిలయాలు'గా మార్పు చేయడం, 'దిశ మొబైల్ యాప్'ను ఏర్పాటుచేయడం, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలను బలోపేతం చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 700 మహిళా సహాయక డెలు ఏర్పాటు చేయబడ్డాయి.

41. 5వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'లింగ సమానత్వం' మరియు 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నిరంతర, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, పూర్తి ఉత్పాదకతతో కూడిన ఉపాధిని కల్పించడంలో భాగంగా ఎంతో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు సంక్షేమం కోసం వనరులను కేటాయించడం ప్రభుత్వ కర్తవ్యం. 2021-22 మొత్తం బడ్జెట్ వ్యయంలో, పిల్లల అభివృద్ధికి 16,748 కోట్ల 47 లక్షల రూపాయలు మరియు మహిళల అభివృద్ధికి 47,283 కోట్ల 21 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

సంక్షేమం-సమానత్వ సాధన

’న్యాయ-అన్యాయాల అంతరం లేకుండా వర్షం అందరిపై సమంగా కురిసినట్టుగానే, మీ వాత్సల్యమును కూడా అందరిపై సమానంగా చూపండి'

అని గౌతమ బుద్ధుడు బోధించాడు అనే విషయం మనందరికీ తెలిసినదే.

42. సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'స్థిరమైన పురోగతిని నమోదు చేయడం' సమర్థ వంతమైన సామాజిక మౌలిక సదుపాయాలను నిర్మించడం అత్యవసరం. ఈ లక్ష్యం కొరకు పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాలని పిలుపునిచ్చింది. అన్ని వర్గాల పౌరుల సంక్షేమానికీ, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాల వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి

21