పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3 సంవత్సరాలలో నాడు-నేడు పథకం క్రింద పూర్తి చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

అన్నం పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ లోకంలో వందనాలు అందుకోతగినవారే! మన ముఖ్యమంత్రిగారు ఈ కోవకు చెందినవారు. అందుకు జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యం. చదువుతో పాటు సరైన పోషకాహారం అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రిగారు పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారు. నాణ్యమైన చదువు చెప్పించడంతోపాటు - వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోని చిన్నారులందరికీ జగన్మోహన్ రెడ్డిగారు అత్యంత ప్రియమైన మేనమామగా మారిపోయారు.

36. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మరియు 6 నుండి 172 నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉన్న రక్తహీనత మరియు పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి, వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని అంగన్‌వాడి కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నాము. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్ వాడి కేంద్రాల ద్వారా 6 నుండి 72 నెలల మధ్య వయస్సు గల 23 లక్షల 70 వేల మంది పిల్లలకు మరియు 6 లక్షల 46 వేల మంది గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు సంపూర్ణ పౌష్టికాహార భోజనం, పాలు మరియు గుడ్లను అందజేస్తున్నాము. వీటి అమలు ద్వారా 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలయిన 'ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రతను సాధించడం మరియు పోషణను మెరుగుపరచడం'లను సాధించగలుగుతున్నాము.

18