పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎస్‌సి, ఎస్‌టీ కులాలకు చెందిన వధువుల కోసం 2019-20లో 28,568 మంది ఎస్‌సి వధువులు మరియు 4,290 మంది ఎస్‌టి వధువులు, 20,000 మంది అల్పసంఖ్యాక వర్గాల వధువులకు ప్రయోజనం కల్పిస్తూ రూ.1,00,000/-ల కళ్యాణ కానుక ఇవ్వడం జరుగుతుంది.

ఇతర సంక్షేమ పథకాలు

77. టెక్నాలజీ ఆధారిత అంతరాలు, సాంప్రదాయ వృత్తులకు ప్రమాదకరం. ఆటో రిక్షాలు, ట్యాక్సీలను స్వంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు 'ఓలా' మరియు 'ఉబర్' వంటి యాప్ ఆధారిత మోబిలిటి అగ్రిగేటర్ నిర్వాహకులతో పోటీపడలేకపోతున్నారు. బీమా, ఫిటినెస్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం అయ్యే వ్యయాన్ని భరించడానికి ఏడాదికి రూ.10,000/-లను సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకువస్తుంది. సొంత ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల ప్రయోజనం కోసం బడ్జెటులో రూ.400 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

78. ఈ ప్రభుత్వం న్యాయవాదులకు ప్రాక్టీసు మొదటి మూడు సంవత్సరాల కాలంలో రూ.5000ల నెలవారీ స్టయిఫండును సమకూర్చడానికి ప్రతిపాదిస్తున్నది. దీనికోసం, 2019-20లో 10 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక, 100 కోట్ల రూపాయలతో న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నాను.

అగ్రిగోల్డ్

79. అగ్రిగోల్డు కంపెనీలు ప్రజల నుండి అధిక వడ్డీ రేటును లేదా దానికి బదులుగా భూమిని రిజిస్టరు చేస్తామనే వాగ్దానంతో డిపాజిట్లను సేకరించాయి. అయితే, కంపెనీలు డిపాజిట్లను చెల్లించడం గానీ లేదా ఏదేని భూమిని డిపాజిటర్ల పేరిట రిజిస్టరు చేయడం గానీ జరగలేదు. ఇది తమ జీవనకాల పొదుపులను కోల్పోయిన లక్షలాది మంది డిపాజిటర్లలో తీవ్రమైన దుఃఖాన్ని, భయాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డు స్కామ్‌లో దాదాపు 11.5 లక్షల మంది బాధితులు ఉన్నారు. వారికి మద్ధతునివ్వవలసిన

28