సరోరుహాప్తవంశసంగ సంగరాంగణార్జునా ధరామరోల్లసద్రమానిదాన దానవైరవా స్ఫురత్కరాగ్రజాగ్రదుగ్రభూరిధారసారస త్కరాళచండఖడ్గదండదండితారిమండలా.
ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజన విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవభాగదేయ వేంకటనామధేయ ప్రణీతంబైన కామందకనీతిశాస్త్రంబున స్వామ్యనుజీవివృత్త లక్షణంబును, గంటకశిక్షణంబును రాజపుత్రరక్షణంబును నాత్మ రక్షావిచక్షణత్వంబును నున్నది తృతీయాశ్వాసము.