పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/85

ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

డాదిగాఁ గల్గియుండెడునట్టివెల్ల
గుఱుతు లగుచుండు విషములఁ గూడెనేని
యిన్నివిధముల విషమిడు టెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

109


చ.

పలుకులు కొంకి మ్రాన్పడుట, పల్మరు దొట్రిలి నాల్గుదిక్కులన్
గలయగఁ జూచుటల్, జెమట గ్రమ్ముట కంపము బుట్టు టావులిం
తలు మొగమెండి నల్లఁబడి తారుటలుం గడుఁ జంచలించుటల్
పెలుచఁదనంబునన్ విషముఁబెట్టిన వానికిఁ జిహ్నముల్‌ మహిన్.

110


క.

నీరును మధు వౌషధములు
నారసి యొనరించువాని కవి మున్నిడి తా
నేరుపుతోఁ గొనవలయును
భూరమణుఁడు ప్రతిదినంబు భోజ్యాదులతోన్.

111


క.

తొలుతఁ బరీక్షింపుచు ము
ద్రలు బెట్టినభూషణములు దావుల పూవుల్
గలపంబులు మొదలైనవి
యెలమిఁ గలుగు బంట్లు బతికి నీయఁగ వలయున్.

112


క.

తనకుం బరరాజులు పని
చినవస్తువు లెల్ల వేగఁ జేకొన కెందున్
మునుపె పరీక్షింపుచుఁ గై
కొనఁగాఁ దగు నాత్మహితముఁ గోరెడిపతికిన్.

113


క.

మిగులఁగ నితవరులగుచున్
దగునాప్తులు ప్రోవవలయు ధరణీవిభునిన్
బగవారివలన దన వా
రగువారలవలన హాని యడరక యుండన్.

114