పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది


మాలిని.

చతురగుణవిశేషా సత్యభాషావిభూషా
యతులితగుణదానా యాశ్రితాంచన్నిధానా
శ్రుతిపథయుతచర్యా శూరసంస్తుత్యశౌర్యా
సతతజయవిహారా సంగమాంబాకుమారా.

122


గద్యము :-

ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱానామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవభాగధేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన [1]కామందుక నీతిశాస్త్రంబున విద్యావర్ణాశ్రమ
పాలనప్రభావంబును దీనజనరక్షణంబును సజ్జనలక్షణంబును
మధురవచోవివక్షణత్వంబును సప్తాంగపరీక్షణంబును నన్నది
ద్వితీయాశ్వాసము.


  1. కామందక