పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది


వారణంబులఁ బొల్చు వనదేశములు గల్గి
            నీళ్ళ త్రోవలచేత నేల త్రోవ
చే నేటికాల్వలచే నొప్పు భూములు
           నరనాయకులకును సిరు లొసంగు


గీ.

మొరములును జౌడు [1]కొడపలు ముచ్చుబంట్లు
చెట్టుమిట్టలుఁ బుట్టలు వెట్టఁదనము
గుండ్లు ముండ్లును బాములదండ్లు గల్గు
వసుధ యెవ్వేళ సంపద లొసఁగ లేదు.

99

గ్రామ లక్షణము

సీ.

తనకును జీవనం బొనఁగూర్చి శత్రు బా
           ధల కోర్చి భూగుణంబులఁ దనర్చి
జలము లూరెడిచోట్లు గలిగి గట్లకు నున్కి
           పట్టులై కోమట్లు బనులవారు
గాఁపు లుద్యోగముల్ గాంచి దున్నెడువారు
          గడుఁ గల్గి యనురాగగరిమఁ జెలఁగి
పశుసంతతులు గల్గి బహుదేశజనులచే
          నాకీర్ణ మగుచు ధనాఢ్య మగుచు


గీ.

అరయ ధార్మికోపేతమై వ్యసని మూర్ఖు
నాయకుఁడు గల్గు దేశంబు నరవరుండు
బహుళయత్నంబునను వృద్ధిపఱచి ప్రోవ
వలయుఁ బతియందు సంపదల్ వెలయుఁగాన.

100

కోట లక్షణము

సీ.

చెలువమై విరివియౌ సీమ చాలఁగఁ గల్గి
            చెఱకు రాజనములచేలు గల్గి
కలువలు దామరల్ గల యగడ్తలు గల్గి
            వనములు గొండలు గనులు గల్గి

  1. కడపులు