పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

సమాశ్రయప్రకరణము

వ.

మఱియు సమాశ్రయగుణంబు బలవంతుడగు నితరునైనను
గాక తనశత్రువునైన నాశ్రయించుటంజేసి రెండు విధంబులై
యుండుఁ దత్క్రమం బెట్లనిన.

148


సీ.

బలవంతుచే నొంపఁబడి నిరుపాయుఁడై
            ప్రతిసేయఁగా లేక బడలినపుడు
కులమును సత్యంబు బలమును గల్గిన
            యార్యుని నొక్కని నాశ్రయించి
వినయంబుతో నిత్యమును బొడగని చేరి
            యతనిభావం బెల్ల నాత్మ నెఱిఁగి
చెప్పినకైవడిఁ జేసి వినీతుల
            గతి గురువులఁ గొల్చుకరణిఁ గొల్చి


గీ.

యతనిదయచేతఁ బరిపూర్ణుఁడై స్వతంత్ర
వృత్తిఁ జెందుచుఁ గ్రమమున వెలయు టొప్పు
నిట్టి యన్యసమాశ్రయం బెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

149


సీ.

అహితులచే నొచ్చి యార్తుఁడై యాశ్రయ
            హీనుఁడై తగు సంధి లేనివాఁడు
భండారమైనను బలమునైనను భూమి
           యైనను దూఫలంబైన మఱియు
సకలంబునైన నిశ్చలతఁ జెందుచు నిచ్చి
           యతివినయంబున నతనిఁజేరి
తా బల్మిచెందినతఱి నైన శత్రువుఁ
           డాపదఁ జెందిన యప్పుడైన