పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

తనదు సైన్యంబుచేతనే తగ నొనర్చు
సంధి యాత్మామిషం బనుసంధి యండ్రు
ప్రాణరక్షణమునకు సర్వంబు నొసఁగి
కలసియుండుట యది యుపగ్రహ మటండ్రు.

68


సీ.

భండారమం దొకపా లిచ్చి యైన నం
           దెచ్చదాఁకినసొమ్ము లిచ్చియైనఁ
దనదుభండార మంతయు నిచ్చియైనను
           సంధించి ప్రకృతిరక్షణ మొనర్ప
నిది పరిక్రియసంధి యనఁ జెలువొందును
           దనభూమిమే లెంచి తనపగఱకు
నొనగూడి యిచ్చిన నుచ్ఛిన్నసంధి యౌ
           దద్భూమిఫల మింత ధన మటంచు


గీ.

నమర నిచ్చిన ఫలదూషణాఖ్యసంధి
ఫలమె విభజించి కందాయముల నొసంగ
నిర్ణయించుట స్కంధోపనేయసంధి
యిట్టిమార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.

69


సీ.

బాలుండు వృద్ధుండు బహుదీర్ఘరోగుండు
             నిజబంధుదాయాదనిందితుండు
పిఱికి యైనయతండు పిఱికిబంటై యుండు
             పిఱికిబంట్ల యతండు పిసిడివాఁడు
విరసరాజ్యాంగుఁడు విషయసక్తుండును
             బహుచిత్తమంత్రుండు బహువిరోధి
కరుపులు వ్యసనముల్ గలిగినయతఁడును
             వ్యసనముల్ గలుగుసైన్యములవాఁడు